లారెన్స్‌ 'లక్ష్మీబాంబ్‌'కు కొత్త సమస్య

రాఘవ లారెన్స్‌ బాలీవుడ్‌ డెబ్యూ మూవీ 'లక్ష్మీబాంబ్‌'ను ఏ ముమూర్తాన స్టార్ట్‌ చేశారో కానీ.. సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. షూటింగ్‌ సమయంలో లారెన్స్‌ ఏదో సమస్యతో ప్రాజెక్టును వీడిపోతానని చెప్పాడు. అయితే హీరో అక్షయ్‌ కుమార్‌ కలుగచేసుకుని గొడవలను సర్దుబాటు చేశాడు. సినిమాను ఈ ఏడాది మే నెలలో విడుదల చేయాలని అనుకోగానే, కరోనా ప్రభావం ప్రారంభం కావడంతో థియేటర్స్ మూతపడ్డాయి. దీంతో నిర్మాతలు ఏం చేయలేక సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారు. నవంబర్‌ 9న సినిమాను ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్‌కు కూడా చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

ఇక సినిమా స్ట్రీమింగ్‌కు కొన్ని రోజులే ఉన్నాయనుకునే సందర్భంలో ఇప్పుడొక కొత్త సమస్య వచ్చిపడింది. 'లక్ష్మీబాంబ్‌' లవ్‌ జీహాదీని ప్రోత్సహించే విధంగా ఉందని హిందూ సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. వివరాల్లోకెళ్తే.. హిందూసేన అధ్యక్షుడు లక్ష్మీబాంబ్‌ లవ్‌ జీహాదీకి మద్దతుని తెలియజేసేలా ఉందని కాబట్టి తమ సంస్థ తరపున 'లక్ష్మీబాంబ్‌'పై ఫిర్యాదు చేయబోతున్నట్లు ప్రకటించారు. మరి ఈ వ్యవహారంపై దర్శక నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి. రాఘవ లారెన్స్‌ తమిళంలో తెరకెక్కించిన చిత్రం 'కాంచన'కు రీమేక్‌గా రూపొందిన చిత్రమే 'లక్ష్మీబాంబ్‌'. రీమేక్‌లో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది.

More News

‘కళాపోషకులు’ టీజ‌ర్ విడుద‌ల‌..

విశ్వకార్తికేయ, దీప ఉమావతి హీరోహీరోయిన్లుగా శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై  చలపతి పువ్వల ద‌ర్శ‌క‌త్వంలో ఏమ్. సుధాకర్ రెడ్డి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం ‘కళాపోషకులు’.

మలయాళ రీమేక్‌లో కలెక్షన్‌ కింగ్‌

కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు.. ఈ మధ్య కాలంలో చాలా సెలక్టివ్‌గానే సినిమాలను యాక్సెప్ట్‌ చేస్తున్నారు.

విరిగిపడిన కొండ చరియలు.. ఐదారుగురున్నట్టు అనుమానం..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడ్డాయి. రాళ్ల కింద ఐదారుగురు శానిటేషన్‌ సిబ్బంది ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఎఫ్‌ 2..అనీల్‌ రావిపూడికి ఇండియన్‌ పనోరమ అవార్డ్‌

2019  సంక్రాంతి సినిమాల బరిలో విడుదలైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'ఎఫ్‌ 2..ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌'.

సంక్రాంతి బరిలోకి రానా 'అరణ్య'

రానా ద‌గ్గుబాటి టైటిల్ పాత్ర పోషించిన అర‌ణ్య చిత్రం వచ్చే ఏడాది అంటే 2021 సంక్రాంతికి థియేటర్స్‌లో సందడి చేయనుంది.