Jana Sena, YCP:పిఠాపురంలో నయా ట్రెండ్.. తగ్గదేలే అంటున్న జనసేన, వైసీపీ క్యాడర్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ ఎన్నికల కౌంటింగ్‌కు మరో ఆరు రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో అందరూ ఫలితాలతపై ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గం పిఠాపురం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ఈ నియోజకర్గం హాట్ టాపిక్ అయ్యింది. ఫలితాలు వెల్లడయ్యే లోపే జనసైనికులు పిఠాపురంలో కొత్త ట్రెండ్‌ను తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గెలుపుపై ధీమాతో తమ బైక్‌లు, కార్ల నంబర్ ప్లేట్లపై 'పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా' అంటూ రాయిస్తున్నారు. నంబర్ ప్లేట్లపై జనసేన పార్టీ సింబల్‌తో ఇలా ఫలానా వారి తాలూకా అంటూ స్టిక్కర్లు అంటించుకుని తిరుగుతున్నారు. ఈ వాహనాల వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
ఇప్పుడు పిఠాపురం మొత్తం ఈ ట్రెండ్ నడుస్తోంది. నంబర్ ప్లేట్లకు స్టిక్కరింగ్ చేసే షాపుల్లో సందడి కనిపిస్తోంది. పిఠాపురంలోని ఓ సెంటర్లో.. రెండ్రోజుల్లోనే ఏకంగా 300 బోర్డులు తయారు చేసినట్లు షాపుల యజమానులు చెబుతున్నారు. జనసైనికులు సంగతి అలా ఉంటే.. ఇటు వైఎస్సార్సీపీ కార్యకర్తలు కూడా తగ్గేది లేదంటున్నారు. తాము కూడా రెడీ అంటూ ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. జనసేనకు కౌంటర్‌గా వైఎస్సార్సీపీ అభ్యర్థి వంగా గీతకు డిప్యూటీ సీఎం పదవి హామీ ఇవ్వడంతో ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ వీళ్లు కూడా బైక్‌లు, కార్లపై రాయిస్తున్నారు.
మొత్తానికి ఇలా పిఠాపురంలో జనసైనికులు, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. తమ పార్టీ అభ్యర్థిదే విజయం అంటూ ధీమాతో ఉన్నారు. అందుకే పోటాపోటీగా వాహణాల నంబర్ ప్లేట్లపై ఫలానా వారి తాలూకా అంటూ కొత్త ట్రెండ్‌ను తీసుకొచ్చారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని ప్రకటించిన రోజు నుంచి అక్కడ రాజకీయాలు వేడెక్కాయి.. జనసేన పార్టీ తరఫున పలువురు టాలీవుడ్ ప్రముఖులు ప్రచారం చేశారు. ఇటు వైఎస్సార్సీపీ కూడా పోటీగా ప్రచారం చేసింది. ఇక చివరి రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వంగా గీత తరఫున ప్రచారం నిర్వహించారు. గీతమ్మను గెలిపిస్తే డిప్యూటీ సీఎంను చేస్తానని స్వయంగా జగన్ హామీ ఇచ్చారు. మరి పిఠాపురంలో ఎవరు గెలుస్తారో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments