Jana Sena, YCP:పిఠాపురంలో నయా ట్రెండ్.. తగ్గదేలే అంటున్న జనసేన, వైసీపీ క్యాడర్..

  • IndiaGlitz, [Wednesday,May 29 2024]

ఏపీ ఎన్నికల కౌంటింగ్‌కు మరో ఆరు రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో అందరూ ఫలితాలతపై ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గం పిఠాపురం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ఈ నియోజకర్గం హాట్ టాపిక్ అయ్యింది. ఫలితాలు వెల్లడయ్యే లోపే జనసైనికులు పిఠాపురంలో కొత్త ట్రెండ్‌ను తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గెలుపుపై ధీమాతో తమ బైక్‌లు, కార్ల నంబర్ ప్లేట్లపై 'పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా' అంటూ రాయిస్తున్నారు. నంబర్ ప్లేట్లపై జనసేన పార్టీ సింబల్‌తో ఇలా ఫలానా వారి తాలూకా అంటూ స్టిక్కర్లు అంటించుకుని తిరుగుతున్నారు. ఈ వాహనాల వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

ఇప్పుడు పిఠాపురం మొత్తం ఈ ట్రెండ్ నడుస్తోంది. నంబర్ ప్లేట్‌లకు స్టిక్కరింగ్ చేసే షాపుల్లో సందడి కనిపిస్తోంది. పిఠాపురంలోని ఓ సెంటర్‌లో.. రెండ్రోజుల్లోనే ఏకంగా 300 బోర్డులు తయారు చేసినట్లు షాపుల యజమానులు చెబుతున్నారు. జనసైనికులు సంగతి అలా ఉంటే.. ఇటు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కూడా తగ్గేది లేదంటున్నారు. తాము కూడా రెడీ అంటూ ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. జనసేనకు కౌంటర్‌గా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వంగా గీతకు డిప్యూటీ సీఎం పదవి హామీ ఇవ్వడంతో ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ వీళ్లు కూడా బైక్‌లు, కార్లపై రాయిస్తున్నారు.

మొత్తానికి ఇలా పిఠాపురంలో జనసైనికులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. తమ పార్టీ అభ్యర్థిదే విజయం అంటూ ధీమాతో ఉన్నారు. అందుకే పోటాపోటీగా వాహణాల నంబర్ ప్లేట్లపై ఫలానా వారి తాలూకా అంటూ కొత్త ట్రెండ్‌ను తీసుకొచ్చారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని ప్రకటించిన రోజు నుంచి అక్కడ రాజకీయాలు వేడెక్కాయి.. జనసేన పార్టీ తరఫున పలువురు టాలీవుడ్ ప్రముఖులు ప్రచారం చేశారు. ఇటు వైఎస్సార్‌సీపీ కూడా పోటీగా ప్రచారం చేసింది. ఇక చివరి రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వంగా గీత తరఫున ప్రచారం నిర్వహించారు. గీతమ్మను గెలిపిస్తే డిప్యూటీ సీఎంను చేస్తానని స్వయంగా జగన్ హామీ ఇచ్చారు. మరి పిఠాపురంలో ఎవరు గెలుస్తారో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.

More News

Pinnelli: పిన్నెల్లికి ఏపీ హైకోర్టులో మరోసారి భారీ ఊరట..

పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరోసారి భారీ ఊరట దక్కింది. ఆయనపై నమోదైన మరో మూడు కేసుల్లో ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

RS Praveen Kumar: తెలంగాణ గీతంపై ఆంధ్రా సంగీత దర్శకుడు పెత్తనం ఏంది బై: ఆర్‌ఎస్పీ

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న రాష్ట్ర గీతం 'జయజయహే తెలంగాణ' చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని

Rakshana: పాయల్ రాజ్‌పుత్ 'రక్షణ' జూన్ 7న గ్రాండ్ రిలీజ్

‘Rx100’, ‘మంగళవారం’ వంటి సినిమాలతో తనదైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఆమె ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన పాత్ర‌ల‌కు భిన్నంగా..ప‌వ‌ర్‌ఫుల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో

Pune Car Incident: పుణే ర్యాష్ డ్రైవింగ్ కేసులో అదిరిపోయే ట్విస్టులు.. తాజా ట్విస్ట్ ఏంటంటే..?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణేలో డ్రంకన్ డ్రైవ్ కారు కేసులో రోజుకో సంచలన పరిణామం చోటుచేసుకుంటుంది. థ్రిల్లర్ మూవీలను మించిన ట్విస్టులు బయటపడుతున్నాయి.

MLC Elections: ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ప్రలోభాలు.. స్వతంత్ర అభ్యర్థిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి!

తెలంగాణలోని ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు గ్రాడ్యుయేట్లు పోలింగ్ స్టేషన్ల ముందు బారులు తీరారు.