కరోనా కాదు.. కుల క్వారంటైన్ సెంటర్లు.. ఏపీలో నయా ట్రెండ్..

  • IndiaGlitz, [Thursday,August 20 2020]

కరోనా సమయంలో.. అసలే ఎవరినీ అంటీ ముట్టకూడదంటే.. కులంగాని కులం వారితో కలిసుండాల్సిన దుస్థితి ఏంటి అనుకున్నారో ఏమోగానీ నయా ట్రెండ్‌కి తెరదీశారు. ఇది ఎక్కడో కాదు.. తెలుగు వాళ్లు గర్వంగా చెప్పుకునే ఏపీలో.. నవ్విపోదురు గాక అనుకున్నా సరే.. వెనక్కి తగ్గేదే లేదు. కుల సంఘాలతో కలిసి ప్రత్యేక క్వారంటైన్‌ సెంటర్ ఏర్పాటు చేసుకుంటున్నారు. మరి వైద్యులు వారి కులానికి చెందిన వారే వైద్యం అందిస్తున్నారో లేదో కానీ బలమైన సామాజిక వర్గాలు అవలంబిస్తున్న వింత పోకడ ఇది. ప్రభుత్వం.. ప్రతిపక్షమే రెండు సామాజిక వర్గాలుగా విడిపోయి నిందారోపణలు చేసుకుంటుంటే సామాన్య ప్రజలు ఊరుకుంటారా..? కరోనా టైంలో క్వారంటైన్ సెంటర్లను సైతం కులాల వారీగా నెలకొల్పారు.

అసలే తెలంగాణతో పోలిస్తే ఏపీలో కుల ప్రభావం చాలా ఎక్కువ. దీంతో కమ్మ క్వారంటైన్ సెంటర్.. రెడ్డి క్వారంటైన్ సెంటర్.. కాపు, వైశ్య, రాజు అంటూ క్వారంటైన్ సెంటర్లు వెలిశాయి. అన్నట్టు ఇది ఇక్కడ మొదలైన ట్రెండ్ కాదు.. ఈ ట్రెండ్ సెట్టర్స్ ఉత్తరాది వారు.. అక్కడ బలమైన సామాజిక వర్గాలుగా పిలవబడే అగర్వాల్స్, జైన్స్ తదితరులు. ఈ ట్రెండ్‌ను మన ఏపీ వాళ్లు ఫాలో అవుతున్నారు అంతే. ఇవన్నీ అనధికారికంగానే నడుస్తున్నాయి. అయినా ప్రభుత్వానికి ఇదేమీ తెలియదంటే మాత్రం పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగిన సామెతను గుర్తు తెచ్చుకోవాల్సి వస్తుంది.

ప్రభుత్వం నుంచి అన్ని సౌకర్యాలు లేకపోవడం.. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజులను భరించలేకపోవడం వంటి అంశాలు ప్రజలను ఈ కుల క్వారంటైన్ల వైపు నడిపించాయని టాక్. అయితే దీనిని నిర్వాహకులు అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలోనే సమర్థించుకుంటున్నారు. అందరికీ సాయం చేసేంత ఆర్థిక స్తోమత తమకు లేదని.. కాబట్టి కనీసం తమ కులస్తులకైనా సాయం చేయాలనిపించి ఈ క్వారంటైన్‌ సెంటర్లను నిర్వహిస్తున్నాం తప్ప కులతత్వాన్ని ప్రోత్సహించడం తమ ఉద్దేశం కాదనేది నిర్వాహకుల వాదన. ఏది ఏమైనా కరోనా సమయంలో ఒకరికొకరు తోడుండాల్సింది పోయి.. కులాల వారీగా చీలిపోవడమేంటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

More News

‘వి’.. 200 దేశాలు, టెరిటరీస్‌లో.. ఉద్వేగంగా ఉంది: నాని

నేచురల్ స్టార్ నాని.. సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వి’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో

హైదరాబాద్‌ మురుగు నీరు చెప్పిన నిజం.. 6.6 లక్షల మందికి కరోనా!

హైదరాబాద్‌లో ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాలకూ.. టైటిల్‌కూ ఏమాత్రం సంబంధం లేకుండా ఉందా? అసలు నిజమైతే ఇదేనని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ),

భారీ బ‌డ్జెట్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ చిత్రం!!

ఇండ‌స్ట్రీలో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన అతి కొద్ది కాలంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

నాగ్ ద‌ర్శ‌కుడి వెబ్ సిరీస్‌..!!

ప్ర‌స్తుం డిజిట‌ల్ ట్రెండ్ న‌డుస్తోంది. ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ అంద‌రూ డిజిట‌ల్ మాధ్య‌మంలోకి అడుగు పెడుతున్నారు.

చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాం.. రూమర్స్‌ని స్ప్రెడ్ చేయకండి: సింగర్ మాళవిక

ఓ టీవీ షో షూటింగ్‌కు ముందే తాను కరోనా బారిన పడ్డానంటూ ఓ పేక్ వాట్సాప్ సందేశం సోషల్ మీడియాలో