టాలీవుడ్‌కు శుభవార్త .. ఏపీలో అందుబాటులోకి కొత్త టికెట్ ధరలు, త్వరలోనే జీవో
Send us your feedback to audioarticles@vaarta.com
గడిచిన కొన్ని నెలలుగా టాలీవుడ్‌కు - ఏపీ ప్రభుత్వానికి మధ్య నలుగుతున్న టికెట్ ధరల పెంపు, థియేటర్ల సమస్యలకు చెక్ పెట్టేందుకు సినీ ప్రముఖులు కీలక ముందడుగు వేశారు. దీనిలో భాగంగా గురువారం మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని సినీ సెలబ్రిటీలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా సినీ రంగ సమస్యలపై కీలక ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. ఈ నెలాఖరులోగా శుభవార్త వింటామని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే కొత్త టికెట్ ధరలంటూ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
నిన్న ప్రభుత్వం సినీ ప్రముఖుల ముందు ప్రతిపాదించిన ధరలను పరిశీలిస్తే... నగరపాలక సంస్థల పరిధిలో వున్న మల్టీప్లెక్సుల ధర రూ 150 గా.. ఏసీ థియేటర్లలో కనిష్ట ధర రూ. 70 కాగా... గరిష్టం రూ. 100 గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఏసీ లేని థియేటర్లలో కనిష్టంగా రూ 40 , గరిష్ట ధర రూ. 60 గా నిర్ణయించారు. పురపాలక సంఘాల పరిధిలో మల్టీప్లెక్సుల ధర రూ 125గా నిర్ణయించారు.
ఏసీ థియేటర్లలో మినిమం టిక్కెట్ ధర రూ 60 గా... గరిష్ఠ ధర రూ 80 గా ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఏసీ లేని థియేటర్లలో కనిష్ఠ ధర రూ 30... గరిష్ఠ ధర రూ 50గా నిర్ణయించారు. అదే విధంగా నగర పంచాయితీల్లోని మల్టీప్లెక్సుల్లో టికెట్ ధర రూ. 100 గా నిర్ణయించారు. ఏసీ థియేటర్లలో కనిష్ట ధర రూ 50 గా, గరిష్టంగా రూ 70 గా ఫిక్స్ చేసారు. ఏసీ లేని థియేటర్లలో కనిష్ట ధర రూ 20 కాగా, గరిష్ట ధర రూ 40 గా ఖరారు చేసినట్లు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout