భారత్‌లోకి ప్రవేశించిన కొత్త స్ట్రెయిన్.. హైదరాబాద్‌లో 2 కేసులు..
Send us your feedback to audioarticles@vaarta.com
కొత్త స్ట్రెయిన్ గురించి తెలిసీ తెలియగానే యూకే నుంచి విమానాల రాకపోకలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. భారత్‌లోకి కరోనా కొత్త స్ట్రెయిన్ రాకను మాత్రం నిలువరించలేకపోయింది. భారత్‌లోకి కొత్త స్ట్రెయిన్ ప్రవేశించింది. అంతే కాదు.. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్‌లో సైతం ఈ మహమ్మారి అడుగు పెట్టింది. ఇంగ్లండ్ నుంచి తిరిగొచ్చిన ఆరుగురిలో తొలిసారిగా ఈ స్ట్రెయిన్‌ను గుర్తించినట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా కొత్తగా నమోదైన కరోనా స్ట్రెయిన్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. వాటిలో బెంగలూరు 3, హైదరాబాద్ 2, పుణెలో 1 చొప్పున స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి.
ఇటీవల బ్రిటన్ నుంచి వచ్చిన 176 మంది భారత్‌కు వచ్చారు. వీరందరికీ కరోనా పరీక్షలు చేయగా వారిలో ఆరుగురికి కొత్త స్ట్రెయిన్ నిర్ధారణ అయింది. వీరిలో బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్(ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్)లో ముగ్గురిని గుర్తించారు. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ)లో ఇద్దరిని, అలాగే పూనేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎఐవీ)లో ఒకరిని గుర్తించినట్లు తెలుస్తోంది. వేరు వేరు రాష్ట్రాల్లో గుర్తించిన వీరిపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ఆరోగ్య శాఖలు ప్రత్యేక దృష్టి సారించాయి.
కరోనా కొత్త స్ట్రెయిన్ బాధితులను ఒక్కొక్కరినీ ఒక్కో గదిలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ఆరోగ్య శాఖలు ప్రకటించాయి. అంతేకాకుండా వీరికి ఇప్పటివరకు సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించి వారిని కూడా వెంటనే క్వారంటైన్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ప్రతి రాష్ట్రంలోనూ అధికారులు అలెర్ట్ అయ్యారు. యూకే నుంచి వచ్చిన వారిని గుర్తించి పరీక్షలు నిర్వహించి ఒకవేళ కొత్త స్ట్రెయిన్ నిర్ధారణ అయితే వారికి ప్రత్యేక చికిత్సను అందించేందుకు ఆసుపత్రుల్లో ప్రత్యేక గదులను సైతం సిద్ధం చేస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments