భారత్‌లోకి ప్రవేశించిన కొత్త స్ట్రెయిన్.. హైదరాబాద్‌లో 2 కేసులు..

  • IndiaGlitz, [Tuesday,December 29 2020]

కొత్త స్ట్రెయిన్ గురించి తెలిసీ తెలియగానే యూకే నుంచి విమానాల రాకపోకలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. భారత్‌లోకి కరోనా కొత్త స్ట్రెయిన్ రాకను మాత్రం నిలువరించలేకపోయింది. భారత్‌లోకి కొత్త స్ట్రెయిన్ ప్రవేశించింది. అంతే కాదు.. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్‌లో సైతం ఈ మహమ్మారి అడుగు పెట్టింది. ఇంగ్లండ్ నుంచి తిరిగొచ్చిన ఆరుగురిలో తొలిసారిగా ఈ స్ట్రెయిన్‌ను గుర్తించినట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా కొత్తగా నమోదైన కరోనా స్ట్రెయిన్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. వాటిలో బెంగలూరు 3, హైదరాబాద్ 2, పుణెలో 1 చొప్పున స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి.

ఇటీవల బ్రిటన్ నుంచి వచ్చిన 176 మంది భారత్‌కు వచ్చారు. వీరందరికీ కరోనా పరీక్షలు చేయగా వారిలో ఆరుగురికి కొత్త స్ట్రెయిన్ నిర్ధారణ అయింది. వీరిలో బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్(ఎన్ఐఎంహెచ్‌ఏఎన్ఎస్)లో ముగ్గురిని గుర్తించారు. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ)లో ఇద్దరిని, అలాగే పూనేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎఐవీ)లో ఒకరిని గుర్తించినట్లు తెలుస్తోంది. వేరు వేరు రాష్ట్రాల్లో గుర్తించిన వీరిపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ఆరోగ్య శాఖలు ప్రత్యేక దృష్టి సారించాయి.

కరోనా కొత్త స్ట్రెయిన్ బాధితులను ఒక్కొక్కరినీ ఒక్కో గదిలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ఆరోగ్య శాఖలు ప్రకటించాయి. అంతేకాకుండా వీరికి ఇప్పటివరకు సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించి వారిని కూడా వెంటనే క్వారంటైన్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ప్రతి రాష్ట్రంలోనూ అధికారులు అలెర్ట్ అయ్యారు. యూకే నుంచి వచ్చిన వారిని గుర్తించి పరీక్షలు నిర్వహించి ఒకవేళ కొత్త స్ట్రెయిన్ నిర్ధారణ అయితే వారికి ప్రత్యేక చికిత్సను అందించేందుకు ఆసుపత్రుల్లో ప్రత్యేక గదులను సైతం సిద్ధం చేస్తున్నాయి.

More News

రజినీకాంత్ సంచలన ప్రకటన.. రాజకీయాల్లోకి రాబోనని స్పష్టం

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సంచలన ప్రకటన చేశారు. పార్టీ ఎప్పుడెప్పుడు పెడతారా? అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది నిజంగా షాకింగ్ న్యూసే.

మ‌రో మ‌ల్టీస్టార‌ర్‌కు దిల్‌రాజు ప్లాన్‌..!

ప్ర‌స్తుతం తెలుగు సినీ ఇండ‌స్ట్రీలోని స్టార్ ప్రొడ్యూస‌ర్స్‌లో దిల్‌రాజు ఒక‌రు. క‌థ‌ల‌పై న‌మ్మ‌కంతో చిన్న సినిమాలు, ఇమేజ్‌ను బేస్ చేసుకుని స్టార్ హీరోల సినిమాలు చేస్తూ దిల్‌రాజు

2020.. చిత్ర పరిశ్రమకే బొమ్మ చూపించింది.. కానీ ఆయనకు మాత్రం..

2020.. మామూలుగా లేదుగా.. చిత్ర పరిశ్రమ అయితే ఇప్పటికీ కోలుకోలేదు. ఇండస్ట్రీ పరంగా బాక్సాఫీస్‌ను షేక్ ఆడించే సినిమాలతో

అవినాష్‌కి నాగ‌బాబు భారీ ఆఫ‌ర్‌..!

జ‌బ‌ర్‌ద‌స్త్ అవినాష్‌.. బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన‌ప్పుడు పెద్ద‌గా అత‌నిపై ఎవ‌రికీ న‌మ్మ‌కం లేద‌నే చెప్పాలి.

భారీగా డిమాండ్ చేస్తున్న మోనాల్‌..?

ఐదు సినిమాల్లో న‌టించిన మోనాల్ గ‌జ్జ‌ర్‌కు ఇక సినిమాల్లో అవ‌కాశాలు రావు అని అనుకుంటున్న త‌రుణంలో బిగ్‌బాస్ 4 ఆమె రూట్‌ను మార్చేసింది.