ప్రభుదేవా కొత్త షేడ్..

  • IndiaGlitz, [Sunday,June 25 2017]

కొరియోగ్రాఫర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ప్ర‌భుదేవా త‌ర్వాత డ్యాన్స్ మాస్ట‌ర్‌గా, న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా మారారు. అన్నింట్లో స‌క్సెస్ అయిన ప్ర‌భుదేవా ఇప్పుడు రూట్ మార్చి విల‌న్‌గా న‌టించ‌బోతున్నాడ‌ని స‌మాచారం. పిజ్జా ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న 'మెర్‌క్యురి' అనే చిత్రంలో ప్ర‌భుదేవా విల‌న్‌గా చేయ‌బోతున్నాడ‌ట‌.

కార్తీక్ సుబ్బరాజు సినిమాలంటే కొత్త‌గానే ఉంటాయి. తీసిన సినిమాల‌న్నీ ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన‌వే. ఇప్పుడు ప్ర‌భుదేవాను కొత్త కోణంలో చూపిస్తున్నాడు కార్తీక్ సుబ్బ‌రాజు. న‌టుడిగానే కాకుండా ప్ర‌భుదేవా త్వ‌ర‌లోనే ఓ సినిమాను డైరెక్ట్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడ‌ట‌.