Sivangi Serial: ఈ నెల 25 నుండి జెమినీ టీవిలో రానున్న 'సివంగి'
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు ప్రేక్షకుల వినోదానికి కేరాఫ్ అడ్రస్ జెమిని టివి . ఎన్నో కార్యక్రమాలను , మరిన్నో సీరియల్స్ ను మనకు అందించిన జెమిని టివి.. ఇప్పుడు మనకు 'సివంగి'.. అనే సరికొత్త సీరియ హిల్ ను మార్చ్ 25 నుండి ప్రసారం చేయబోతోంది.
ఒక పల్లెటూరిలో పేద కుటుంబంలో పుట్టి, ఊరిలోని ఆడవాళ్ళ డ్రెస్సులు కుడుతూ అమ్మానాన్నలకు ఆర్ధికంగా సహాయపడుతూ, స్నేహితులతో సరదాగా జీవితాన్ని గడిపే అమ్మాయి ఆనంది.
వూళ్ళో ఎవరికీ ఏ కష్టం వచ్చినా, సొంత మనిషిలా వెళ్లి సహాయపడుతుంది . అక్క పెళ్ళిలో ఏర్పడిన అనుకోని పరిస్థితుల వల్ల ఒక కొడుకులా ఇంటి బాధ్యతలు భుజాన వేసుకొని , అవి నెరవేర్చడానికి సిటీకి ప్రయాణమవుతుంది. సిటీకి వెళ్లిన ఆనంది ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి ?. తన అక్క పెళ్లి చేయగలిగిందా ?. తిరిగి తన వూరు వెళ్లగలిగిందా ?
జెమిని టివిలో.. సివంగి. ఈనెల 25న ప్రారంభం - సాయంత్రం 7.30 గంటలకు.
ప్రతిమ,రేణుక,నటకుమారి,చంద్రశేఖర్,శ్రీ ప్రియ తదితర నటీనటులు నటించారు.
ఈ నెల 25వ తేదీ సోమవారం సా 7:30 గం.లకు జెమిని టివి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ "సివంగి ”. సీరియల్ ప్రేక్షకుల ఆధారాభిమానాలను పొందడంలో ఎలాంటి సందేహం లేదని జెమినీ టీవీ యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com