జనతా గ్యారేజ్ లో రిలీజ్ తర్వాత మరికొన్ని సీన్స్..!
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం జనతా గ్యారేజ్. ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన జనతా గ్యారేజ్ చిత్రం సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఇదిలా ఉంటే...సెన్సార్ పూర్తైన తర్వాత జనతా గ్యారేజ్ నిడివి 8 నిమిషాలు తగ్గించారని ప్రచారం జరుగుతుంది. ఇదే విషయాన్ని డైరెక్టర్ కొరటాల శివని అడిగితే...అలాంటిది ఏమీ లేదు. 8 నిమిషాలు నిడివి తగ్గించాం అనేది వాస్తవం కాదు. అవసరమైతే... రిలీజ్ తర్వాత ఓ 10 నిమిషాలు నిడివి ఉండేలా మరికొన్ని సీన్స్ యాడ్ చేయాలి అనుకుంటున్నాం అని తెలియచేసారు. అది సంగతి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments