కరోనా వల్ల ఆగిపోయిన చిత్రాలు పూర్తయ్యాకే.. టాలీవుడ్ స్ట్రిక్ట్ రూల్స్!
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం దేశవ్యాప్తంగా కాస్తంత తగ్గింది. దీనితో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మళ్ళీ ఆశలు చిగురించాయి. కరోనా వల్ల ఆగిపోయి మూలన పడి ఉన్న చిత్రాలని మళ్ళీ దులుపుతున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ పెద్దల కీలక సమావేశం జరిగింది.
తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ మరియు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ జాయింట్ మీటింగ్ బుధవారం జరిగింది. సినిమా షూటింగ్స్ తిరిగి ప్రారంభం అవుతున్నందుకు ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా ప్రభావం దృష్ట్యా కొన్ని కఠిన నిబంధనలు ప్రతి ఒక్క చిత్ర యూనిట్ పాటించాలని తీర్మానించారు.
24 క్రాఫ్ట్స్ సంబంధించిన వారు ఎవరైనా సరే కరోనా వల్ల ఆగిపోయి, తాను కమిటై ఉన్న చిత్రాలని పూర్తి చేసిన తర్వాతే కొత్త చిత్రాలకు అంగీకారం తెలపాలి. కరోనా వల్ల ఆగిపోయిన చిత్రాల బ్యాలన్స్ వర్క్ పూర్తయిన తర్వాత ఇతర కమిట్మెంట్స్ చూసుకోవచ్చు. దర్శకులు అందుకు అనుగుణంగా షెడ్యూల్ కుదించుకుని వేగంగా మిగిలిన భాగం షూటింగ్ పూర్తయ్యేలా చూడాలి.
షూటింగ్ కి హాజరయ్యే ప్రతి ఒక్కరూ విధిగా కనీసం ఒక డోసు వ్యాక్సిన్ వేయించుకోవాలి. అందుకు సంబంధించిన డిక్లరేషన్ ని సమర్పించాలి. ప్రభుత్వం విధించిన గైడ్ లైన్స్ పాటించాలి. ప్రతి ఒక్క టెక్నీషియన్, ఆర్టిస్ట్ సామజిక బాధ్యతతో వ్యవహరించాలి అని ఈ సమావేశంలో తీర్మానించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments