అక్టోబర్.. కొంచెం కష్టం.. కొంచెం ఇష్టం
Send us your feedback to audioarticles@vaarta.com
అక్టోబర్ వచ్చేసింది. రూలింగ్ అయితే మారలేదు కానీ రూల్స్ మాత్రం మారిపోయాయి. కొత్త రూల్స్ అమలులోకి వచ్చేశాయి. దీని వల్ల కొందరికి ప్రయోజనం కలగనుండగా.. మరికొందరిపై ప్రభావం పడనుంది. ఏయే అంశాలు మారాయి. ఎవరికి ప్రయోజనం.. ఎవరిపై ప్రభావం అనేది తెలుసుకోవడం అత్యవసరం కాబట్టి అవేంటో తెలుసుకుందాం..
వాహనాదారులకు శుభవార్త.. హెల్త్ ఇన్స్యూరెన్స్‌లో మార్పులు..
వాహనదారులకు మాత్రం మేలే జరగనుంది. లైసెన్స్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్, పర్మిట్స్ వంటి పలు కీలక డాక్యుమెంట్లను ఇకపై జేబులో పెట్టుకొని తిరగాల్సిన పని లేదు. వీటిని ప్రభుత్వ వెబ్ పోర్టల్‌లో పెట్టుకొని వాటిని అధికారులకు చూపిస్తే చాలు. అంతేకాకుండా డ్రైవింగ్‌లో ఫోన్ ఉపయోగించొచ్చు. అయితే అది రూట్ నావిగేషన్ కోసం మాత్రమే వినియోగించాలి. ఫోన్‌లో మాట్లాడుతూ అధికారులకు పట్టుబడితే మాత్రం రూ.5 వేల వరకు జరిమానా కట్టాల్సిందే. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో కూడా మార్పులు వచ్చాయి. ఐఆర్‌డీఏఐ అక్టోబర్ నుంచి కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే తీసుకున్న కొత్త పాలసీలన్నీ దాదాపు చాలా వరకు వ్యాధులకు వర్తిస్తాయి.
విదేశాలకు డబ్బు పంపితే ట్యాక్స్.. ఉచిత సిలిండర్లకు చెక్..
అక్టోబర్‌లో కొత్త ట్యాక్స్ రూల్ అమల్లోకి వచ్చాయి. వీటి కారణంగా ఇక నుంచి ఎవరైనా విదేశాలకు డబ్బులు పంపితే ట్యాక్స్ పడుతుంది. అయితే కాస్త ఊరటనిచ్చే అంశం ఏంటంటే.. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.7 లక్షలకు పైన డబ్బులు పంపితేనే ఇది వర్తిస్తుంది. 5 శాతం టీసీఎస్ పడుతుంది. అయితే విద్యార్థులకు మాత్రం పన్నులో రాయితీ లభిస్తుంది. ఇక మీదట ఉజ్వల స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు లాక్ డౌన్ సమయంలో ఉచితంగానే గ్యాస్ సిలిండర్లను అందించింది. అయితే ఇకపై ఈ ఉచిత సిలిండర్లకు కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. ఇక మీదట ఉచిత సిలిండర్ రాదు.
స్వీట్ షాపుల్లో ఇవి తప్పనిసరి..
స్వీట్స్ కొనుగోలుదారులకు మాత్రం ఇది శుభవార్తే. కొత్తగా వచ్చిన రూల్ ప్రకారం ఇకపై స్వీట్ షాపుల్లో స్వీట్స్ ఎక్స్‌పైరీ డేట్‌తో పాటు దాన్ని ఎవరు తయారు చేశారు? ఎప్పటిలోగా ఉపయోగిస్తే బాగుంటుంది వంటి వివరాలను సైతం కచ్చితంగా కస్టమర్లకు అందించాల్సిందే. ఇక ఫుడ్ రెగ్యులేటర్ ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త రూల్‌ను ఒకదాన్ని తీసుకువచ్చింది. ఆవాల నూనెను మరే ఇతర నూనెలతో కలపకూడదని రూల్స్ జారీ చేసింది.
టీవీ కొనుగోలుదారులకు షాక్.. మారిన డెబిట్, క్రెడిట్ కార్డు రూల్స్
పండుగ సీజన్‌లో బోలెడన్ని ఆఫర్లు ఉంటాయి. కాబట్టి టీవీ కొనుగోలు చేద్దాం అని భావించే వారికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అక్టోబర్ 1 నుంచి టీవీల ధరలు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం కస్టమ్ డ్యూటీ మినహాయింపును తొలగించడంతో ఓపెన్ సేల్స్‌పై 5 శాతం పన్ను అదనంగా పడనుంది. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు రూల్స్ కూడా మారాయి. అక్టోబర్ 1 నుంచి కొన్ని కార్డులపై అన్ని రకాల సేవలూ అందుబాటులో ఉండవు. ప్రత్యేకించి అంతర్జాతీయ లావాదేవీలకు బంద్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఆదాయపు పన్ను శాఖ సైతం కొత్త రూల్ తెచ్చింది. అక్టోబర్ 1 నుంచి ఈకామర్స్ కంపెనీలకు ఇది వర్తిస్తుంది. అంటే ఈ కంపెనీలు అవి విక్రయించే ప్రొడక్టులపై 1 శాతం టీసీఎస్‌ను వసూలు చేస్తాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com