గోవాలో ఇకపై షూటింగ్ చేయాలంటే ఏం చేయాలో తెలుసా!

  • IndiaGlitz, [Saturday,February 15 2020]

సినీ ప్రేమికులు షూటింగ్స్ చేయ‌డానికి ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే తీర ప్రాంతాల్లో గోవా ముందు వ‌రుస‌లో ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేక‌ర్స్ సినిమాల‌ను తెర‌కెక్కిస్తూ వ‌చ్చారు. అయితే ఇక‌పై గోవాలో షూటింగ్స్ చేయాలంటే కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. ఈ విష‌యాన్ని గోవా ముఖ్య‌మంత్రి ప్ర‌మోద్ సావంత్ తెలిపారు. గోవా అంటే కేవ‌లం తీర ప్రాంత అందాల‌నే కాదు.. అక్క‌డ మాద‌క ద్ర‌వ్యాలు దొరుకుతాయ‌న్న‌ట్లు ప‌లు చిత్రాల్లో చూపిస్తున్నార‌ని త‌ద్వారా రాష్ట్ర ప్ర‌తిష్ట‌కు భంగం వాటిల్లుతుంద‌ని, గౌర‌వం దెబ్బ తింటుంద‌ని గోవా ముఖ్య‌మంత్రి పేర్కొంటూ ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌పై గోవాలో షూటింగ్‌లు చేసుకోవాల‌ను ద‌ర్శ‌క నిర్మాత‌లు ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఆఫ్ గోవా అనే ప్ర‌భుత్వ ఆధీనంలో ప‌నిచేసే సంస్థ‌కు వారి స్క్రిప్ట్‌ను అందించాల్సి ఉంటుంది. సద‌రు సంస్థ అధికారులు స్క్రిప్ట్‌ను ప‌రిశీలించి ఓకే అంటేనే షూటింగ్‌ను జ‌రుపుకోవాల్సి ఉంటుంద‌ట‌. రీసెంట్‌గా విడుద‌లైన మ‌లంగ్ సినిమాలో గోవాను మాద‌క ద్ర‌వ్యాల క్రేందంగా చూపించారట... ఇలాంటి ఘటనలు ఎక్కువ సినిమాల్లో చూపడం వల్ల ఇబ్బందిగా మారింద‌ని ముఖ్య‌మంత్రి పేర్కొన్నారు.

More News

'అమ్మ‌దీవెన‌` ట్రైల‌ర్ లాంచ్ చేసిన సీనియ‌ర్ హీరోయిన్ జీవిత రాజ‌శేఖ‌ర్

ల‌క్ష్మీ స‌మ‌ర్ప‌ణ‌లో ల‌క్ష్మ‌మ్మ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ఎత్తరి మార‌య్య‌, ఎత్తరి చిన మారయ్య, ఎత్తరి  గుర‌వ‌య్యలు కలసి శివ ఏటూరి ద‌ర్శ‌క‌త్వంలో

చిరు విషయంలో జగన్ మాస్టర్ ప్లాన్ నిజమే..!

జనసేనాధిపతి పవన్ కల్యాణ్‌ బ్రేక్‌లు వేయడానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేశారని www.indiaglitz.com ఇదివరకే ‘వైఎస్ జగన్ మాస్టర్ ప్లాన్..

దేవరకొండ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో గోల్డ్ మెడల్ సాధించిన కిక్ బాక్సర్ గణేష్ ఎంబారి

హీరో విజయ్ దేవరకొండ స్థాపించిన ‘‘దేవరకొండ ఫౌండేషన్’’ చేసిన చిన్న ఆర్థిక సహాయం ఓ యువ క్రీడాకారుడి కెరీర్ కు దోహదపడింది.

21న వస్తున్న నయనతార 'వసంతకాలం'

లేడి సూపర్ స్టార్ నయనతార నటించగా ఘన విజయం సాధించిన ఓ సస్సెన్స్ హారర్ థ్రిల్లర్ ను 'వసంత కాలం' పేరుతొ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు

'15-18-24 లవ్ స్టోరీ' ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేసిన మెహ్రీన్ పిర్జాదా

వయసు ప్రభావం ప్రేమ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. పదిహేను, పద్దెనిమిది, ఇరవై నాలుగు వయసులలో ప్రేమ దాని పర్యవసానాల మీద అద్భుతమైన కథా కథనాలతో మాడుపూరి కిరణ్ కుమార్ దర్శకత్వంలో