గోవాలో ఇకపై షూటింగ్ చేయాలంటే ఏం చేయాలో తెలుసా!
Send us your feedback to audioarticles@vaarta.com
సినీ ప్రేమికులు షూటింగ్స్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడే తీర ప్రాంతాల్లో గోవా ముందు వరుసలో ఉంటుందనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేకర్స్ సినిమాలను తెరకెక్కిస్తూ వచ్చారు. అయితే ఇకపై గోవాలో షూటింగ్స్ చేయాలంటే కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు. గోవా అంటే కేవలం తీర ప్రాంత అందాలనే కాదు.. అక్కడ మాదక ద్రవ్యాలు దొరుకుతాయన్నట్లు పలు చిత్రాల్లో చూపిస్తున్నారని తద్వారా రాష్ట్ర ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని, గౌరవం దెబ్బ తింటుందని గోవా ముఖ్యమంత్రి పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఇకపై గోవాలో షూటింగ్‌లు చేసుకోవాలను దర్శక నిర్మాతలు ఎంటర్టైన్మెంట్ ఆఫ్ గోవా అనే ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సంస్థకు వారి స్క్రిప్ట్‌ను అందించాల్సి ఉంటుంది. సదరు సంస్థ అధికారులు స్క్రిప్ట్‌ను పరిశీలించి ఓకే అంటేనే షూటింగ్‌ను జరుపుకోవాల్సి ఉంటుందట. రీసెంట్గా విడుదలైన మలంగ్ సినిమాలో గోవాను మాదక ద్రవ్యాల క్రేందంగా చూపించారట... ఇలాంటి ఘటనలు ఎక్కువ సినిమాల్లో చూపడం వల్ల ఇబ్బందిగా మారిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com