'ఆధార్' అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారా!?
Send us your feedback to audioarticles@vaarta.com
ఇప్పుడు సర్వం ఆధార్ కార్డే. ఏ చిన్న పని చేయాలన్నా మొదట అడిగేది ఆధార్ కార్డు ఉందా అనే మాటే వస్తుంది. అయితే ఏ చిన్న మిస్టేక్ ఉన్నా అంతే సంగతులు. ఆ మిస్టేక్స్ సరిదిద్దుకోవాలంటే కనీసం 10 నుంచి 15 రోజుల పాటు ఎమ్మార్వో ఆఫీస్.. మీ సేవ అంటూ కాళ్లరిగేలా తిరగాల్సిందే. ఇవన్నీ వద్దనుకుంటే ఆదార్ సెంటర్‌కు అయినా వెళ్లాలి. అయితే ఇలా ఒకట్రెండు సార్లు కాదు ఎన్నిసార్లయినా తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఇదివరకు ఉండేది. అయితే ఇకపై మునపటి మాదిరిగా ఎన్నిసార్లు పడితే.. అన్నిసార్లు ఆధార్‌ను ఇప్పుడు అప్డేట్ చేసుకోవడానికి వీల్లేదు. ఇందుకుగాను తాజాగా ఉడాయ్ ప్రకటించిన కొత్త నిబంధనల పాటించాల్సిందే మరి.
ఇవీ నిబంధనలు..
- తాజా నిబంధనల ప్రకారం తప్పులుంటే రెండుసార్లు మాత్రమే మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది.
- పుట్టినతేదీ, లింగం విషయంలో కేవలం ఒక్కసారి మాత్రమే మార్చుకునేందుకు ఛాన్స్ ఉంటుంది.
- ఆధార్ కార్డులో చాలా వరకు పుట్టిన తేదీల్లో తప్పులుంటాయ్.. అసలు కార్డుపై వచ్చిన పుట్టిన తేదీకి.. ఒరిజినల్ పుట్టిన తేదీకి అసలు సంబంధాలే ఉండవ్. అయితే ఇకపై ఎలా పడితే అలా ఇష్టానుసారం మార్చుకోవడానికి లేదు.. మూడేళ్లు ఎక్కువగానీ.. లేదా తక్కువగానీ మాత్రమే చాన్స్ ఉంటుంది. అది కూడా బర్త్ సర్టిఫికేట్ ఉంటేనే లేకుంటే కుదరదు. ఒకవేళ ఎక్కువసార్లు పుట్టిన తేదీల్లో మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే ఆదార్ సెంటర్‌కు వెళ్లాల్సిందే మరి.
- మార్పులు చేర్పులకు సంబంధించిన ఆధారాలను పోస్టు ద్వారా, ఈ మెయిల్ ద్వారా అధికారులకు పంపాల్సి ఉంటుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments