నాగ్ సెట్ లో న్యూ రూల్..
Send us your feedback to audioarticles@vaarta.com
నవరస సమ్రాట్ నాగార్జున - దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందుతున్న మరో భక్తిరస చిత్రం ఓం నమో వెంకటేశాయ. ఈ చిత్రాన్ని శిరిడి సాయి చిత్ర నిర్మాత మహేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నెల 2 నుంచి అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో ప్రత్యేకంగా రూపొందించిన టెంపుల్ సెట్ లో షూటింగ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే...ఈ భక్తిరస చిత్రం సెట్ లో న్యూ రూల్ పాస్ చేసారట.
ఇంతకీ ఈ సెట్ లో ప్రవేశపెట్టిన కొత్త రూల్స్ ఏమిటంటే...ప్రతి ఒక్కరి నుదట నిలువు బొట్టు పెట్టుకోవడం...ఒంటి పై తెల్లటి కుర్తా ధరించడం...ఒకరినొకరు గోవిందా...అని పిలుచుకోవడం...సెల్ ఫోన్ కు సెలవు చెప్పడం..పాదరక్షలను ధరించకుండా ఉండడం వంటి రూల్స్ పెట్టారట. రూల్ ఈజ్ రూల్.. రూల్ ఫర్ ఆల్ అన్నట్టు హీరో నుంచి చిన్న ఆర్టిస్ట్ వరకూ..పెద్ద టెక్నీషియన్ నుంచి చిన్న టెక్నీషియన్ వరకు ప్రతి ఒక్కరూ ఈ రూల్స్ పాటిస్తూ భక్తి శ్రద్దలతో వర్క్ చేస్తున్నారట. దీంతో ఈ షూటింగ్ జరుగుతున్న ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఇంత భక్తిశ్రద్దలతో రూపొందిస్తున్న ఓం నమో వెంకటేశాయ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో అధ్యాత్మిక అద్భుత చిత్రంగా నిలుస్తుందని ఆశిద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout