'డియర్ కామ్రేడ్' కు కొత్త సమస్య
Send us your feedback to audioarticles@vaarta.com
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన రెండో చిత్రం `డియర్ కామ్రేడ్`. ఈ క్రేజీ హీరో తొలి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. అంతా బాగానే ఉన్న, కర్ణాటకలో ఈ సినిమాకు ఓ కొత్త సమస్య వచ్చిందంటున్నారు. అదేంటంటే.. కర్ణాటకలో సినిమా కన్నడ అనువాద వెర్షన్, తెలుగు డైరెక్ట్ వెర్షన్ విడుదలయ్యాయి.
కన్నడ అనువాద వెర్షన్ను 5 థియేటర్స్లో 8 షోస్లు రన్ చేస్తుండగా.. తెలుగు వెర్షన్స్ను 65 థియేటర్స్లో 250 షోస్ వేశారట. దీనిపై కన్నడ అభిమానులు ఆగ్రహంగా ఉన్నారట. కన్నడనాట కన్నడ సినిమాలకు తక్కువ షోస్ ఇచ్చిన తెలుగు సినిమాకు ఎక్కువ షోస్ ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో కన్నడ వెర్షన్ను మాత్రమే చూడాలని అంటూ పోస్టులు పెడుతున్నారు. మరి కామ్రేడ్ కొత్త సమస్య ఎలా తీరనుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments