Jai Hanuman:శ్రీరామనవమి కానుకగా 'జై హనుమాన్' కొత్త పోస్టర్.. అదిరిపోయిందిగా..
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా చిన్న సినిమాగా విడుదలైంది. పెద్ద సినిమాల ధాటికి థియేటర్లు కూడా దక్కలేదు. అయినా కానీ అంచనాలను తారుమారు చేస్తూ బ్లాక్‌బాస్టర్ హిట్‌గా నిలిచింది. పెద్ద పెద్ద సినిమాలను పక్కకు నెట్టి థియేటర్లు దక్కించుకుంది. ఆ సినిమానే 'హనుమాన్'. ఇక్కడే కాదు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ అదరగొట్టింది. జనవరి 12న రిలీజైన ఈ సినిమా రూ.300కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఓటీటీలోనూ అదరగొడుతోంది. తెలుగు వర్షన్ జీ5లో.. మిగిలిన భాషల వర్షన్స్ డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పటికే మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ రాబట్టి బుల్లి తెర మీద రికార్డులు తిరగరాస్తోంది.
ఈ మూవీకి సీక్వెల్ తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘జై హనుమాన్’ అంటూ సీక్వెల్‌ని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా మూవీని రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ సీక్వెల్ మూవీలో ఆంజనేయ స్వామి సూపర్ హీరోగా కనిపించబోతున్నారు. దీంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది.. ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇందుకు తగ్గట్లే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ విజువల్ వండర్‌గా సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టారు.
కాగా నేడు శ్రీరామనవమి సందర్భంగా ఈ మూవీ నుంచి అదిరిపోయే పోస్టర్‌తో అప్డేట్ ఇచ్చారు. ఆంజనేయస్వామి రాముడుకి ప్రమాణం చేస్తున్న ఫోటోని షేర్ చేసిన ప్రశాంత్ వర్మ.. “నేను ప్రేక్షకులకు ప్రామిస్ చేస్తున్నాను. ఈ సినిమాతో ప్రతి ఒక్కర్ని ఆకట్టుకుంటాను. మునుపెన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో చూపిస్తాను” అంటూ మాట ఇచ్చారు. ఈ పోస్టర్ డిజైన్ అయితే అదిరిపోయింది. దీంతో మరో విజువల్ వండర్ ఖాయమని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీలో తేజ సజ్జా హనుమంతు పాత్రలోనే నటిస్తుండగా.. ఆంజనేయస్వామి పాత్రలో స్టార్ హీరో నటించనున్నారు. ఆ హీరో ఎవరనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇక తేజ సజ్జ సినిమాల విషయానికొస్తే ఇటీవలే మరో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సూపర్ యోధ కాన్సెప్ట్‌తో మూవీని తెరకెక్కించనున్నారు. ఇందులో మంచు మనోజ్ విలన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 18న మూవీకి సంబంధించిన టైటిల్ పోసర్ట్‌ను ప్రకటించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments