సెప్టెంబర్ లో ఎన్టీఆర్ కొత్త చిత్రం...
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జనతాగ్యారేజ్ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన సోదరుడు కల్యాణ్ రాం హోం బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఎవడు, టెంపర్ సహా ఎన్నో చిత్రాలకు కథా రచయితగా పనిచేసిన వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడట. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు అన్నీ పూర్తి చేసుకుని సెప్టెంబర్ నెలలో సినిమాను స్టార్ట్ చేస్తారని ఫిలింవర్గాల సమాచారం. ఆగస్టు 12న జనతాగ్యారేజ్ రిలీజ్ అవుతుంది. తర్వాతే ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటరవుతాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments