డిజిటల్ మాధ్యమాల్లో కొత్త సినిమాల ప్రసారానికి బ్రేక్
- IndiaGlitz, [Wednesday,March 20 2019]
డిజిటల్ మాధ్యమాలైన అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ 5, హాట్ స్టార్.. సంస్థలు సినిమాలను తమ మాధ్యమంలో ప్రసారం చేయడానికి నిర్మాతలకు భారీ మొత్తాన్ని ముట్ట చెబుతున్నాయి. నిర్మాణ వ్యయం ముందుగానే వస్తుండటంతో నిర్మాతలు కూడా డిజిటల్ హక్కులను సదరు సంస్థలకు అప్పగించేస్తున్నారు. అయితే ఈ నిర్ణయమే సినిమాలకు శాపంగా మారుతున్నాయి.
అదేంటంటే..విజయవంతమైన సినిమాలను 3-4 వారాల్లోనే సదరు డిజిటల్ సంస్థలు ప్రసారం చేసేస్తున్నాయి. అప్పటికింకా సినిమా థియేటర్స్ ప్రదర్శింపబడుతూనే ఉంటుంది. ఇది నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్‌కి శాపంగా మారుతుంది. ఈ సమస్యను డిజిటల్ సంస్థలతో మాట్లాడి పరిష్కరించుకోవాలని అనుకుంటున్నారు.
ఎట్టకేలకు నిర్మాతల మండలి ఓ మంచి నిర్ణయం తీసుకుంది. మండలిలోని నిర్మాతలతో చర్చించి సినిమాలు విడుదలైన 8 వారాల తర్వాతే డిజిటల్ మాధ్యమాల్లో ప్రసారం అయ్యేలా ప్రతి నిర్మాత వారితో ముందుగానే చర్చించుకుని హక్కులను అమ్ముకోవాలనేదే ఈ నిర్ణయం. మరి ఈ నిర్ణయంపై డిజిటల్ సంస్థలు ఎలా స్పందిస్తాయో చూడాలి.