Sankranthi Posters; సంక్రాంతి పోస్టర్లు తీసుకొచ్చిన హీరోలు.. ఫ్యాన్స్‌కు డబుల్ పండుగ..
Send us your feedback to audioarticles@vaarta.com
సంక్రాంతి శోభతో తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంది. పల్లెటూర్లు పండుగ కళ సంతరించుకున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా పండుగ వేడుకలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ తమ చిత్రాల అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఓవైపు థియేటర్లలో విడుదలైన సినిమాలు అలరిస్తుంటే.. మరోవైపు తమ చిత్రాలకు సంబంధించిన టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌లు విడుదల చేశారు.
తాజాగా తమిళ స్టార్ హీరో సూర్య, మాస్ డైరెక్టర్ శివ కాంబోలో తెరకెక్కతోన్న 'కంగువ' సినిమా నుంచి పొంగల్ విషెస్ పోస్టర్ రిలీజైంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోసర్లు, గ్లింప్స్ ఆకట్టుకోగా.. ఇప్పుడు సూర్యకు సంబంధించిన మరో క్యారెక్టర్ రివీల్ చేస్తూ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో సూర్య రెండు పాత్రల్లో కనిపిస్తున్నాడు. "డెస్టినీ అనేది టైం కంటే కూడా బలమైంది. భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఈ సినిమా ఉండబోతుంది" అని మూవీ యూనిట్ తెలిపింది. 10భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల 'సలార్' మూవీతో బ్లాక్‌బాస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న డార్లింగ్.. కామెడీ జోనర్ మూవీలు తీసే మారుతి దర్శకత్వంలో హీరోగా నటిస్తున్నాడు. పండుగ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. హార్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ మూవీకి 'రాజాసాబ్' అనే పేరు ఖరారు చేశారు. ఈ పోస్టర్‌లో ప్రభాస్ లుంగీ కట్టుకుని చాలా క్యూట్‌గా ఉన్నాడు. చాలా కాలం తర్వాత మరోసారి డార్లింగ్‌గా అలరించేందుకు సిద్ధమయ్యాడు.
ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి, 'బింబిసారా' దర్శకుడు వశిష్ఠ కలయికలో రాబోతున్న సినిమా పేరును కూడా ప్రకటించారు. ఈ చిత్రానికి ముందు నుంచి అనుకుంటున్నట్లు ‘విశ్వంభర’ అనే టైటిల్ ఖరారు చేశారు. టైటిల్ రివీల్ సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్ టీజర్ అభిమానులకు అబ్బురపరుస్తోంది. ఇవే కాకుండా మరికొన్ని చిత్రాల పోసర్టు కూడా విడుదలయ్యాయి. 'ఈగల్', 'కెప్టెన్ మిల్లర్', 'ఆపరేషన్ వాలంటైన్' వంటి చిత్రాల విడుదల తేదీలను ప్రకటిస్తూ పోసర్ట్లు విడుదలయ్యాయి.
మరోవైపు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కూడా భవిష్యత్‌లో విడుదల కాబోయే సినిమాల గురించి ప్రకటించింది. క్రేజ్ ఉన్న చిత్రాలన్ని ఈ సంస్థ దక్కించుకోవడం విశేషం. ప్రభాస్ 'సలార్', ఎన్టీఆర్ 'దేవర', బన్నీ 'పుష్ప-2', బాలయ్య-బాబీ చిత్రం, సిద్ధు జొన్నలగడ్డ 'టిల్లు స్క్వేర్'- బొమ్మరిల్లు దర్శకత్వంలోని ఓ చిత్రం, విశ్వక్‌సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి', కార్తికేయ కొత్త చిత్రం, ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ కొత్త మూవీలను తన ఫ్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్ చేసేందుకు దక్కించుకున్నట్లు తెలిపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments