న్యూజెర్సీ లో స్వచ్ఛంద కచేరి
Send us your feedback to audioarticles@vaarta.com
కాశ్మీరీ పండిట్ల పై జరిగిన ఉగ్రవాద దాడుల్లో నష్టపోయినవారిని ఆదుకోవడానికి శల్లి కుమార్ అనే వ్యక్తి ఛారిటీ కాన్సెర్ట్ ను ఏర్పాటుచేసారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఈనెల 15న జరుగబోయే ఈవెంట్ లో సినీతారలు పాల్గొని పర్ఫార్మెన్స్ లు చేయనున్నారు. ఈ ఈవెంట్ లో అఖిల్, రామ్ చరణ్ , శ్రియసరన్, ప్రభుదేవా, మలైకా అరోరా, సోఫీ చౌదరిలు పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డోనాల్డ్ ట్రంప్ హాజరుకాకున్నారు. హైద్రాబాద్ లో జరిగిన ప్రమోషన్ కార్యక్రమంలో హీరోయిన్ శ్రియ పాల్గొన్నారు. ఇలాంటి ఛారిటీ కార్యక్రమాల్లో పాల్గొడం చాలా సంతోషంగా ఉందని శ్రియ తెలిపారు. ఉగ్రవాద దాడుల్లో నష్టపోయిన వారికోసం పెర్ఫార్మ్ చేయడం మా బాధ్యత అనుకొనే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. సౌత్ లో నేను చేసిన సినిమా పాటలకు పెర్ఫార్మ్ చేయనున్నాను అని తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com