ఏపీలో జిల్లాలకు కొత్త ఇన్‌ఛార్జి మంత్రులు వీరే...
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్‌లో వివిధ జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రులను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వుల్లో వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ప్రకటనను ఈ మేరకు ఆదివారం రాత్రి విడుదల చేశారు. కాగా ఇప్పటికే ఇంచార్జ్ మంత్రులను ప్రకటించినప్పటికీ అందులో మార్పులు చేర్పులు చేశారు. అయితే ఎందుకు మార్పులు చేశారు..? పనితీరు సరిగ్గా లేకపోవడం సీఎం వైఎస్ మార్పులు చేశారా..? లేకుంటే మరేమైనా కారణాలు ఉన్నాయా..? అనే విషయం తెలియరాలేదు.
కొత్తగా నియమితులైన జిల్లా ఇన్‌ఛార్జి మంత్రుల వివరాలు...
1. శ్రీకాకుళం- కొడాలి నాని
2. విజయనగరం- వెల్లంపల్లి శ్రీనివాస్
3. విశాఖపట్నం- కురసాల కన్నబాబు
4. తూర్పుగోదావరి- మోపిదేవి వెంకటరమణ
5. పశ్చిమగోదావరి- పేర్ని నాని
6. కృష్ణా- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
7. గుంటూరు- చెరుకువాడ రంగనాథరాజు
8. ప్రకాశం- బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
9.నెల్లూరు-బాలినేని శ్రీనివాస్‌రెడ్డి
10. కర్నూలు- పి.అనిల్ కుమార్ యాదవ్
11. కడప- ఆదిమూలపు సురేష్
12. అనంతపురం- బొత్స సత్యనారాయణ
13. చిత్తూరు- మేకపాటి గౌతంరెడ్డి
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout