ఆకట్టుకున్న కొత్త హీరోయిన్స్
- IndiaGlitz, [Friday,December 21 2018]
ఆకట్టుకున్న కొత్త హీరోయిన్స్
కొత్తదనం అనేది తెలియని ఓ అహ్లాదాన్ని, ఉత్సాహాన్నిస్తుంది. సినిమా రంగానికి వస్తే ప్రతి ఏడాది ఎంతో మంది కొత్త హీరోయిన్స్ పరిచయం అవుతూనే ఉంటారు. అయితే సక్సెస్ వరించేది మాత్రం కొందరినే ఆ కొందరు కొత్త హీరోయిన్స్ 2018లో టాలీవుడ్లో సందడి చేశారు.
కియరా అద్వాని
బాలీవుడ్ నుండి టాలీవుడ్‌కి మహేశ్ సినిమా 'భరత్ అనే నేను' చిత్రం ద్వారా పరిచయమైంది కియరా అద్వాని. సీఎం ప్రేయసి పాత్రలో అచ్చ తెలుగు అమ్మాయిలా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన కియరా రాంచరణ్ 'వినయవిధేయరామ'లో కూడా నటిస్తుంది. ఈ రెండు చిత్రాలు తర్వాత తెలుగులో కియరా నటిస్తుందనే అనుకుంటున్నారందరూ.
పాయల్ రాజ్‌పుత్
'ఆర్.ఎక్స్ 100' సినిమా విడుదలైన తర్వాతగానీ సినిమా ఎంటనేది ఎవరికీ తెలియలేదు. చిన్న బడ్జెట్ చిత్రంగా విడుదలైన ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించిందంటే ముఖ్య కారణం పాయల్ రాజ్‌పుత్. ఈ అమ్మడుకి ఇది తొలి సినిమానే అయినా లిప్ లాక్స్లో బోల్డ్‌గా నటించింది. నటన పరంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సక్సెస్‌తో అవకాశాలు వెల్లువెత్తినా అచి తూచి సినిమాలు చేస్తుంది. ఇప్పుడు తమిళంలో ఓ సినిమా, తెలుగులో రవితేజ, వి.ఐ.ఆనంద్ సినిమాలో నటిస్తుంది.
రష్మిక మందన్నా
కన్నడ చిత్రం 'కిరిక్ పార్టీ'తో హీరోయిన్గా పరిచయమై సక్సెస్ సాధించిన రష్మికను తెలుగులో నటింప చేయాలని చాలా మంది దర్శక నిర్మాతలు ప్రయత్నించారు. అయితే నాగశౌర్య హీరోగా నటిస్తూ నిర్మించిన తొలి చిత్రం 'ఛలో' ద్వారా రష్మిక తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో 'ఛలో' కూడా మంచి విజయాన్నే సాధించింది. తదుపరి విజయ్ దేవరకొండతో చేసిన 'గీతగోవిందం' మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుని మోస్ట్ వాంటెడ్ హీరో్యిన్‌గా మారింది. నాగార్జున, నానితో చేసిన 'దేవదాస్' పెద్దగా సక్సెస్ కాకపోయినా రష్మిక క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో 'డియర్ కామ్రేడ్'లో రష్మిక నటిస్తుంది. కన్నడంలో రెండు సినిమాలు చేస్తుంది.
శోభితా దూళిపాళ
తెలుగు హీరోయిన్ అయిన శోభితా బాలీవుడ్ సినిమాల్లోనే నటించింది. అయితే అడివిశేష్ 'గూఢచారి'ద్వారా తెలుగుకి పరిచయమైంది. గ్లామర్‌తో ఆకట్టుకోవడమే కాదు.. నటనతో మెప్పించింది. లిప్‌లాక్స్ కూడా చేసేసింది.
నభా నటేశ్
సుధీర్ బాబు 'నన్ను దోచుకుందువటే' ద్వారా హీరోయిన్గా పరిచయమైంది నభా నటేశ్. అప్పటకే కన్నడ సినిమాల్లో నటించిన ఈ అమ్మాయి రవిబాబు 'అదుగో' ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాల్సింది కానీ.. ఆ సినిమా విడుదల ఆలస్యం కావడంతో 'నన్నుదోచుకుందవటే' ద్వారా పరిచయమైంది. పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకోవడంతో దర్శక నిర్మాతలు ఆమెతో సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపుతున్నారు. ఇప్పుడు ఈమె రవితేజ, వి.ఐ.ఆనంద్ సినిమాలో నటిస్తుంది
రుహానీ శర్మ
హీరో రాహుల్ రవీంద్ర దర్శకుడిగా చేసిన తొలి చిత్రం 'చి.ల.సౌ'. సుశాంత్‌కు విజయం ఈ చిత్రంతో దక్కింది. ఈ చిత్రంలో మధ్య తరగతి అమ్మాయిగా రుహానీశర్మ నటించింది. నటిగా మంచి మార్కులనే కొట్టేసింది రుహానీ.
నిధి అగర్వాల్
బాలీవుడ్ చిత్రం మైకేల్ ద్వారా హీరోయిన్గా రంగ ప్రవేశం చేసిన నిధి అగర్వాల్ తెలుగులో సవ్యసాచి ద్వారా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా.. నిధి అందచందాలు ఆకట్టుకోవడంతో అఖిల్ 'మిస్టర్ మజ్ను'లో అవకాశాన్ని దక్కించుకుంది
అదితిరావు హైదరి
అనువాద చిత్రం 'చెలియా' ద్వారా పరిచయమైనప్పటికీ డైరెక్ట్‌గా ఈమె నటించిన తెలుగు చిత్ర 'సమ్మోహనం'. ఈ సినిమాతో మంచి విజయాన్నే సొంతం చేసుకుంది హైదరి. ఇప్పుడు 'అంతరిక్షం' లో మెయిన్ లీడ్‌గా నటించింది. ఈ 21న సినిమా విడుదలవుతుంది.