అఖిల్ జోడీగా కొత్త హీరోయిన్... ఈసారైనా వర్కవుట్ అవుతుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా.. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై చిత్ర యూనిట్ ఓ క్లారిటీకి వచ్చిందట. సినీ వర్గాల్లో వినిపిస్తోంది. వివరాల మేరకు ముంబైకి చెందిన సాక్షి వైద్య.. అఖిల్ జోడీగా నటించనుందంటున్నారు. రీసెంట్గా ఈ అమ్మడు ఫొటో షూట్లో పాల్గొందని దర్శక నిర్మాతలు సాక్షి వైద్యనే తీసుకోవాలనుకుంటున్నారని, త్వరలోనే ఫైనల్ నిర్ణయం తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది.
అయితే ఇక్కడ అక్కినేని ఫ్యాన్స్‌ను కంగారు పెడుతున్న విషయమొకటి ఉంది. అదేంటంటారా!.. అఖిల్ ఇప్పటి వరకు నాలుగు సినిమాలు చేస్తే అందులో మూడు మాత్రమే విడుదలైయ్యాయి. నాలుగో సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ విడుదలకు సిద్ధంగా ఉంది. కాగా.. ఈ నాలుగు చిత్రాల్లో రెండు సినిమాల్లో కొత్త హీరోయిన్సే నటించారు. అఖిల్‌లో సయేషా సైగల్ డెబ్యూ, హలో చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్‌లు హీరోయిన్స్‌గా నటించారు. ఈ రెండు సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. మరిప్పుడు మూడోసారి మరో కొత్త అమ్మాయి నటిస్తుందని అంటున్నారు. తమ అక్కినేని హీరో హిట్స్ మీద హిట్స్ కొట్టాలని అనుకుంటున్నా అభిమానులు..మరి ఈసారైనా అఖిల్‌కు సక్సెస్ వస్తుందో రాదోనని కంగారు పడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments