నితిన్ మూవీలో కొత్త హీరోయిన్..!
Send us your feedback to audioarticles@vaarta.com
యువ హీరో నితిన్ - అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమ గాథ చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో నటించే హీరోయిన్ కోసం శృతిహాసన్ ను సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. అయితే...తాజాగా ఈ మూవీ కోసం మేఘ ఆకాష్ అనే కొత్త అమ్మాయిని హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్టు సమాచారం.
మేఘ ఆకాష్ ఓ తమిళ చిత్రంలో నటించింది. డైరెక్టర్ హను రాఘవపూడి ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన లోకేషన్స్ ఫైనల్ చేయడం కోసం యు.ఎస్.ఎ వెళ్లారు. హను యు.ఎస్.ఎ నుంచి తిరిగి వచ్చిన తర్వాత షూటింగ్ వివరాలను తెలియచేయనున్నారు. నితిన్ హీరోగా పవన్ - త్రివిక్రమ్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే...14 రీల్స్ నిర్మించే మూవీ, పవన్ - త్రివిక్రమ్ నిర్మించే మూవీ ఈ రెండింటిలో ఏ మూవీ షూటింగ్ ముందుగా ప్రారంభం అవుతుంది అనేది తెలియాల్సివుంది..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com