మరో కొత్త ఫంగస్.. మధ్యప్రదేశ్‌లో వెలుగులోకి
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో తొలుత ట్రీట్‌మెంట్ విషయంలోనే కాస్త ఆందోళన చెందాం. ఆ తరువాత కరోనా ఒక్కటి అదుపులోకి వస్తే చాలని భావించాం. అనుకున్నట్టుగానే ఈ ఏడాది జనవరి నాటికి దాదాపు అదుపులోకి వచ్చింది. మార్చిలో తిరిగి సెకండ్ వేవ్ ప్రారంభమైంది. ఈసారి సెకండ్ వేవ్‌తో పాటు కొత్త రకరకాల ఫంగస్‌లు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. కరోనా సోకితే బతికి బయటపడతామనే నమ్మకమైతే ఉంది కానీ ఫంగస్ బారిన పడితే మాత్రం బతికే అవకాశాలు చాలా తక్కువని ప్రజలు భయపడుతున్నారు.
తాజాగా మరో కొత్త ఫంగస్ ప్రజలకు దడ పుట్టిస్తోంది. ఇప్పటికే బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్‌లు దడపుట్టిస్తుండగా.. ఇప్పుడు కొత్తగా ‘క్రీమ్ ఫంగస్’ కూడా వచ్చిపడింది. ఇందుకు సంబంధించిన ఓ కేసును గుర్తించామని మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ వైద్య కళాశాల ఈఎన్‌టీ విభాగం వైద్యాధికారులు వెల్లడించారు. కరోనా ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఓ రోగికి బ్లాక్, క్రీ మ్ ఫంగస్‌లు రెండూ సోకినట్లు గుర్తించామన్నారు. ప్రస్తుతం అతడికి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు.
ఫంగల్ ఇన్ఫెక్షన్లు సోకడానికి గల కారణాలను నిపుణులు పరిశీలిస్తున్నారు. కరోనా రోగులకు మితిమీరిన స్థాయిలో అందిస్తున్న యాంటీ బయోటిక్ ఔషధాలతో జీర్ణాశయంలోని కీలకమైన గట్ బ్యాక్టీరియా నశిస్తోందని, బహుశా అందువల్లే ఫంగల్ ఇన్ఫెక్షన్లు వ్యాపిస్తుండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఇన్ఫెక్షన్లను ఆదిలోనే అణచి వేయడంలో గట్ బ్యాక్టీరియా ముఖ్య పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout