డబ్బులు ఎవరికీ ఊరికే రావంటూ.. ఏకంగా పాటే పాడేశారు...
Send us your feedback to audioarticles@vaarta.com
డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. అనగానే మనకు ఓ వ్యక్తి గుర్తొస్తారు కదా.. నున్నటి గుండుతో ఆయన తన మాటలతోనే తెగ పాపులర్ అయిపోయారు. డైలాగ్ వినగానే ఒకరు గుర్తుకు రావడం అంటే మామూలు విషయం కాదు. సినిమా హీరో అయితే అది వేరు కానీ ఒక సింపుల్ కమర్షియల్ యాడ్ జనాల్లోకి ఎంతలా చొచ్చుకు పోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ యాడ్ కనిపించకపోతే కూడా అదో పెద్ద విషయంలా జనాలు ఫీలయ్యేవాళ్లు. దాని గురించి సోషల్ మీడియాలో సెటైర్ల మీద సెటైర్లు.. మీమ్స్ తెగ కనిపించేవి.
కమర్షియల్ యాడ్స్‌ను జనాలు పట్టించుకునే రోజులు పోయాయి. ప్రస్తుతం జనాల్లోకి వెళ్లాలంటే ఏదైనా మ్యాజిక్ చేయాలి. కానీ అదేమీ లేకుండా ఒక లలిత జ్యువెలర్స్ ఓనర్ తన మాటలతోనే మ్యాజిక్ చేసేశారు. దీంతో లలిత జ్యువెలర్స్ చేసిన యాడ్ సంచలనం సృష్టించింది. ఓ టైంలో ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా డబ్బులు ఎవరికీ ఊరికే రావు అంటూ కామెడీ కూడా చేసుకున్నారు.. ఒక యాడ్ గురించి ఓ రేంజ్‌లో చర్చ జరగడం బహుశా ఇదే తొలిసారి అయ్యుండవచ్చు.
ఇక ఇప్పుడు మన గుండు బాస్ రూటు మార్చారు. ఇప్పుడిప్పుడే జనాలు ఈ యాడ్‌ను మర్చిపోతున్నారు. ఈ సమయంలో మరోసారి తన లలిత జ్యేువెలర్స్ యాడ్‌ను జనాల్లోకి తీసుకెళ్లాలని భావించినట్టున్నారు. ఇప్పుడు ఇదే కంపెనీ ఓనర్ డబ్బులు ఎవరికీ ఊరికే రావు అంటూ ఏకంగా ఒక పాట పాడుతున్నారు. దానికి యానిమేషన్ రూపం ఇచ్చారు. పీల్చే గాలి, తాగే నీరు ఊరికే వస్తాయేమో కానీ డబ్బులు మాత్రం ఊరికే రావు అంటూ తనదైన శైలిలో లలిత జ్యువెలర్స్ ఓనర్ పాట రాశారు. చివర్లో తన మార్క్ డైలాగ్ కూడా చెప్పారు. ప్రస్తుతానికి ఈ పాట ఆయన చెప్పిన మాట రెండు ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com