ఆది హీరోగా కొత్త చిత్రం ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడుగా ప్రేమకావాలి చిత్రంతో తెరంగేట్రం చేసి డిఫరెంట్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యువ కథానాయకుడు ఆది సాయికుమార్ హీరోగా యు.ఎస్.ప్రొడక్షన్స్, విజయలక్ష్మి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై కొత్త చిత్రం శుక్రవారం హైదరాబాద్ ఫిలింనగర్‌లోని దైవ సన్నిధానంలో జరిగింది. విశ్వనాథ్ అరిగెల దర్శకత్వంలో ఉప్పలపాటి చరణ్‌తేజ్, గుర్రం విజయలక్ష్మి కలిసి సినిమాను నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిష్టర్ తలసాని శ్రీనివాసయాదవ్ క్లాప్ కొట్టగా, నిర్మాత ఉప్పలపాటి చరణ్‌తేజ్ తల్లిదండ్రులు ఉప్పలపాటి రామకృష్ణ, అనురాధ కెమెరా స్విచ్చాన్ చేశారు.
ఈ సందర్భంగా..
ఆది హీరోగా సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. నాకు విశ్వనాథ్‌గారి సినిమాల్లో స్వర్ణకమలం అంటే చాలా ఇష్టం. అందులో భానుప్రియగారి క్యారెక్టర్ చాలా ఇష్టపడ్డాను. అలాంటి క్యారెక్టర్‌తో సినిమా చేయాలనుకున్నప్పుడు శాస్త్రీయ నృత్యంలో ప్రావీణ్యం ఉన్న శ్రద్ధా శ్రీనాథ్‌ను కలవగానే తనే హీరోయిన్ అని ఫిక్సయ్యాను. దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ, ఎ.ఆర్.రెహమాన్ స్టూడెంట్ అయిన ఫణి కల్యాణ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అవుతాయి. ఈ నెల 19 నుండి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం. ఫ్యామిలీ ఎంటర్టైనర్తో పాటు రొమాంటిక్ ఎంటర్టైనింగ్గా సినిమా సాగుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారు అని దర్శకుడు విశ్వనాథ్ అరిగెల తెలిపారు.
సినిమాలపై ప్యాషన్‌తో అమెరికా నుండి సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాం. విజయలక్ష్మిగారితో కలిసి చేస్తున్న సినిమా. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను రూపొందించి, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్లాన్ చేస్తున్నాం. ఆది, శ్రద్దాలతో మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ చేయడం ఆనందంగా ఉంది. దర్శకుడు విశ్వనాథ్ చెప్పిన పాయిట్ నచ్చింది. మంచి టీంతో కలిసి మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని నిర్మాత ఉప్పలపాటి చరణ్ తేజ్ అన్నారు.
దర్శకుడు విశ్వనాథ్ రెండేళ్ల క్రితమే ఈ కథ వినిపించారు. దర్శకుడు అప్పటి నుండి టచ్ లో ఉన్నారు. మూడున్నర నెలల క్రితం దర్శకుడు విశ్వనాథ్ బౌండెడ్ స్క్రిప్ట్‌తో నా దగ్గరకు వచ్చాడు. ఫస్ట్ సీన్ నుండి లాస్ట్ సీన్ వరకు నేరేట్ చేయగానే నాకు కథ బాగా నచ్చడంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. అన్ని ఎలిమెంట్స్ ఉన్న మంచి కుటుంబకథా చిత్రమవుతుందనే నమ్మకం ఉంది. యంగ్ టీంతో కలిసి పనిచేస్తున్నానని హీరో ఆది సాయికుమార్ చెప్పారు.
నేను, చరణ్తేజ్గారు కలిసి చేస్తున్న సినిమా ఇది. తొలి సినిమానే ఆది వంటి ఎనర్జిటిక్ హీరోతో చేయడం హ్యాపీ. విశ్వనాథ్ చెప్పిన పాయింట్ నచ్చడంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాం. మంచి స్క్రిప్ట్ కుదిరింది. మా ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నామని నిర్మాత గుర్రం విజయలక్ష్మి చెప్పారు.
నేను కన్నడం రెండు సినిమాలు, తమిళంలో ఓ సినిమా చేశాను. తెలుగులో నా తొలి సినిమా. లవ్, రొమాన్స్ సహా మంచి సోషల్ మెసేజ్ కూడా ఉన్న మూవీ. నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అని హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ అన్నారు.
ఆది సాయికుమార్, శ్రద్ధా శ్రీనాథ్ హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతంః ఫణి కళ్యాణ్, ఎడిటింగ్ః రవి మన్ల, కళః వినోద్ వర్మ, మాటలుః త్యాగరాజ్, పాటలుః అనంత్ శ్రీరాం, సినిమాటోగ్రఫీః దాశరథి శివేంద్ర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ః రాఘవ చండ్ర, కొలిపెర్ల రోహిత్, నిర్మాతలుః ఉప్పలపాటి చరణ్‌తేజ్, గుర్రం విజయలక్ష్మి, రచన, దర్శకత్వంః విశ్వనాథ్ అరిగెల
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com