వాట్సాప్‌లో కొత్త ఫీచర్..
Send us your feedback to audioarticles@vaarta.com
వాట్సాప్‌లో ఒక కొత్త ఫీచర్ వచ్చింది. అయితే ఇది గతంలో ఉన్నదే అయినా దీనికి టైమ్ పిరియడ్ ఉండేది కానీ ఇప్పుడు టైమ్ పిరియడ్‌తో పాటు ఎప్పటికీ అనే ఆప్షన్‌ను వినియోగదారుల సౌలభ్యం కోసం చేశారు. లేచింది మొదలు పడుకునే వరకూ వాట్సాప్ వినియోగదారుల్ని విసిగించేవి.. గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ వంటి మెసేజ్‌లతో పాటు పలు వీడియోలు సైతం వినియోగదారులకు విసుగు తెప్పిస్తూ ఉంటాయి. వీటి నుంచి తప్పించుకునేందుకు కొత్తగా వచ్చిన ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. నోటిఫికేషన్స్‌ను పర్మినెంట్‌గా మ్యూట్ చేసుకునే సౌకర్యాన్ని వాట్సాప్ కల్పించింది.
ఇప్పటి వరకూ 8 గంటలకు, ఒక వారం, ఒక ఏడాది పాటు మాత్రమే మ్యూట్ చేసుకునే సౌలభ్యం ఉంది. తాజాగా ఏడాది స్థానంలో ‘ఆల్వేస్’ ఆప్షన్‌ను చేర్చింది. దీంతో గ్రూపుల నోటిఫికేషన్లను శాశ్వతంగా మ్యూట్ చేసుకోవచ్చు. అంతే కాకుండా వాట్సాప్ వెబ్‌లో కూడా ఈ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ ఫీచర్‌కు సంబంధించి వాట్సాప్ నెల క్రితమే సమాచారం ఇచ్చింది. దీంతో వినియోగదారులు ఈ ఆప్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి వాట్సాప్‌ను అప్‌డేట్ చేసుకుంటే ఈ ఆప్షన్ మొబైల్‌లోకి అప్‌డేట్ అవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com