వాట్సాప్‌లో కొత్త ఫీచర్..

  • IndiaGlitz, [Friday,October 23 2020]

వాట్సాప్‌లో ఒక కొత్త ఫీచర్ వచ్చింది. అయితే ఇది గతంలో ఉన్నదే అయినా దీనికి టైమ్ పిరియడ్ ఉండేది కానీ ఇప్పుడు టైమ్ పిరియడ్‌తో పాటు ఎప్పటికీ అనే ఆప్షన్‌ను వినియోగదారుల సౌలభ్యం కోసం చేశారు. లేచింది మొదలు పడుకునే వరకూ వాట్సాప్ వినియోగదారుల్ని విసిగించేవి.. గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ వంటి మెసేజ్‌లతో పాటు పలు వీడియోలు సైతం వినియోగదారులకు విసుగు తెప్పిస్తూ ఉంటాయి. వీటి నుంచి తప్పించుకునేందుకు కొత్తగా వచ్చిన ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. నోటిఫికేషన్స్‌ను పర్మినెంట్‌గా మ్యూట్ చేసుకునే సౌకర్యాన్ని వాట్సాప్ కల్పించింది.

ఇప్పటి వరకూ 8 గంటలకు, ఒక వారం, ఒక ఏడాది పాటు మాత్రమే మ్యూట్ చేసుకునే సౌలభ్యం ఉంది. తాజాగా ఏడాది స్థానంలో ‘ఆల్వేస్’ ఆప్షన్‌ను చేర్చింది. దీంతో గ్రూపుల నోటిఫికేషన్లను శాశ్వతంగా మ్యూట్ చేసుకోవచ్చు. అంతే కాకుండా వాట్సాప్ వెబ్‌లో కూడా ఈ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ ఫీచర్‌కు సంబంధించి వాట్సాప్ నెల క్రితమే సమాచారం ఇచ్చింది. దీంతో వినియోగదారులు ఈ ఆప్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి వాట్సాప్‌ను అప్‌డేట్ చేసుకుంటే ఈ ఆప్షన్ మొబైల్‌లోకి అప్‌డేట్ అవుతుంది.

More News

మరో పది రోజుల్లో శశికళ విడుదల..

దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ పదిరోజుల్లో విడుదలయ్యే అవకాశముందని ఆమె తరఫు న్యాయవాది రాజా సెంధూర్‌ పాండ్యన్‌ ప్రకటించారు.

దీక్షిత్ కేసు: ఏడాదిగా డింగ్ టాక్ యాప్ వాడుతున్న నిందితుడు

దీక్షిత్‌రెడ్డి కిడ్నాప్, హత్య కేసు రిమాండ్ రిపోర్ట్‌ను పోలీసులు రూపొందించారు. ఈ రిపోర్టులో పలు విషయాలను పేర్కొన్నారు.

వావ్ అనిపించిన ‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్’..

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా 'జిల్‌' ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'రాధేశ్యామ్‌'.

139 మంది అత్యాచారం కేసులో డాలర్ భాయ్ అరెస్ట్

డాలర్‌ భాయ్‌ని  సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. తనపై 139 మంది అత్యాచారం చేశారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో యువతి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

సిటీ సెంటర్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం..

దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై మహా నగరంలో గురువారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.