రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల శివ, పూరి
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమా పరిశ్రమలో రెండు తరగతులు ఎప్పటికీ ఉంటాయి. అందులో కొందరు యాక్టివ్ మెంబర్స్ ఉంటే.. ఎక్కువ శాతం నాన్ యాక్టివ్ మెంబర్స్ ఉంటారు. ఈ నాన్ యాక్టివ్ మెంబర్స్ ప్రతి డిపార్ట్మెంట్‌లో ఉండి అది తప్పు..ఇది తప్పు అని చెబుతుంటారు. ఇతరులకు తలనొప్పిలా ప్రవర్తిస్తుంటారు. ఉదాహరణకు నిర్మాతల విషయానికి వస్తే యాక్టివ్ ప్రొడ్యూసర్స్ కొంతమందే ఉంటారు. మిగిలినవారు అప్పుడెప్పుడో మేం సినిమాలు తీశాం కదా! మేం కూడా నిర్మాతలమే అన్నట్లు వ్యవహరిస్తుంటారు. దీనిపై యాక్టివ్ నిర్మాతల మండలి ఎర్పడింది. ఇప్పుడు దర్శకుల సంఘంలో కూడా ఇలాంటి మార్పే రాబోతుందని సమాచారం.
సినిమాలను రెగ్యులర్‌గా తెరకెక్కించే రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల శివ, పూరి వంటి కొందరు దర్శకులు ఓ గ్రూపుగా ఏర్పడ్డారని, రెగ్యులర్ డైరెక్టర్స్ గ్రూపులో ఉంటూనే యాక్టివ్ డైరెక్టర్స్ గ్రూపును కొనసాగిస్తారని టాక్ వినపడుతుంది. భవిష్యత్తులో కీలక నిర్ణయాలను తీసుకోవడానికి వీరు కీలకంగా వ్యవహరిస్తారని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే దర్శకుల సంఘం నుండి ఎవరైనా స్పందిస్తేనే కరెక్ట్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments