కరోనా కొత్త స్ట్రెయిన్ టెన్షన్.. మహారాష్ట్ర బాటలోనే కర్ణాటక..

  • IndiaGlitz, [Wednesday,December 23 2020]

కరోనా వైరస్ కొత్త రూపు సంతరించుకుని ప్రపంచాన్ని మరోసారి భయాందోళనలలోకి నెట్టేసింది. యూకేలో ఉత్పరివర్తనం చెందిన ఈ కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పలు దేశాలు బ్రిటన్‌కు విమాన రాకపోకలను నిలిపివేశాయి. ఈ నేపథ్యంలోనే వివిధ దేశాలతో పాటు.. ఆయా దేశాల్లోని రాష్ట్రాలు అలర్ట్ అవుతున్నాయి. భారత్ విషయానికి వస్తే మహారాష్ట్రలో ఇప్పటికే నైట్ కర్ఫ్యూని విధించగా.. తాజాగా కర్ణాటక కూడా అదే బాట పట్టింది. బుధవారం నుంచి కర్ణాటక కూడా నైట్ కర్ఫ్యూని విధించేందుకు సమాయత్తమైంది.

ఇటీవల యూకే నుంచి భారత్‌కు తిరిగొచ్చిన వారిలో 20 మందికి కరోనా పాజిటివ్ రావడంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. ఇది జనవరి 2 వరకు అమల్లో ఉంటుందని కర్ణాట ముఖ్యమంత్రి యడియూరప్ప తెలిపారు. యూకే నుంచి వచ్చే ప్రయాణికులందరూ 72 గంటల్లోగా తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నైట్ కర్ఫ్యూకి ప్రజలంతా సహకరించాలని ముఖ్యమంత్రి యడియూరప్ప కోరారు.

కాగా.. కర్ణాటక ఆరోగ్య మంత్రి డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ.. యూకేలో గుర్తించిన కరోనా కొత్త వైరస్ ను కట్టడి చేసేందుకే నైట్ కర్ఫ్యూ విధిస్తున్నామని తెలిపారు. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులను కూడా మానిటర్ చేస్తున్నామని.. డిసెంబర్ 23 నుంచి జనవరి 2 వరకు రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి ఫంక్షన్లను, ఈవెంట్లను అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే క్రిస్మస్, న్యూఇయర్ సెలబ్రేషన్స్‌పై కూడా కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రాష్ట్రంలో కరోనాను కట్టడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

More News

అనంతపురంలో ఘోరం.. వెలుగులోకి దిశ తరహా ఘటన..

హైదరాబాద్‌లో జరిగిన దిశ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

రియల్ లొకేషన్స్‌కే మహేశ్ మొగ్గు.. !

సూపర్‌స్టార్‌ మహేశ్‌, పరుశురామ్‌ కాంబినేషన్‌లో రూపొందతున్న చిత్రం 'సర్కారు వారి పాటస‌. ఈ సినిమా షూటింగ్‌ రీసెంట్‌గా హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

క‌రోనా ఎఫెక్ట్.. అణ్ణాత్తే షూట్యింగ్ క్యాన్సిల్‌

సూప‌ర్‌స్టార్ రజినీకాంత్‌, శివ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం అణ్ణాత్తే. స‌న్‌పిక్చ‌ర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్..

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పట్టుదలతో ఉంది. మరోవైపు జగన్ సర్కార్..

తల్లి గర్భంలో మైక్రో ప్లాస్టిక్.. వైద్య చరిత్రలో ఇదే తొలిసారి..

ప్లాస్టిక్ గురించి ఎన్ని చెప్పినా మనుషుల మెదడులోకి మాత్రం ఎక్కడం లేదు. పర్యావరణానికి తీవ్ర విఘాతం సృష్టిస్తున్న ఈ ప్లాస్టిక్ ప్రస్తుతం మానవ మనుగడకే ప్రశ్నార్థకంగా మారిపోయింది.