తెలంగాణలో కొత్తగా 2795 కేసులు..

  • IndiaGlitz, [Thursday,August 27 2020]

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. మరోవైపు తెలంగాణలో పరీక్షల సంఖ్యను సైతం పెంచారు. తెలంగాణ హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్య శాఖ గురువారం విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 60,386 శాంపిళ్లను పరీక్షించగా.. 2795 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా.. గడిచిన 24 గంటల్లో ఎనిమిది మంది మృతి చెందగా.. మొత్తంగా ఇప్పటి వరకూ 796 మంది మృతి చెందారు.

కాగా తెలంగాణలో ఇప్పటి వరకూ కరోనా కేసుల సంఖ్య 1,14,483కు చేరుకుంది. కాగా ప్రస్తుతం తెలంగాణలో 27,600 యాక్టివ్ కేసులున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 86,089 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా తెలంగాణలో హోం ఐసోలేషన్‌లో 20,866 మంది ఉన్నట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రతి పది లక్షల జనాభాకు 30,722 పరీక్షల చొప్పున నిర్వహించినట్టు తెలిపింది.

కాగా.. తెలంగాణలో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 449 కేసులు నమోదవగా.. రంగారెడ్డి 268, నల్గొండ 164, ఖమ్మం 152, కరీంనగర్ 136, వరంగల్ అర్బన్ 132, మేడ్చల్ 113, నిజామాబాద్ 112, మంచిర్యాల 106, సిద్ధిపేట 113, మహబూబాబాద్ 102 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటివరకు 11,42,480 కరోనా టెస్టులు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. తెలంగాణలో కేసుల మరణాల రేటు 0.68 శాతం నమోదవగా.. కోలుకున్న వారి రేటు 75.2 శాతం ఉంది.