తెలంగాణలో కొత్తగా 2734 కేసులు..

  • IndiaGlitz, [Tuesday,September 01 2020]

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా తెలంగాణ హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 58,264 శాంపిళ్లను పరీక్షించగా.. కొత్తగా 2734 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ మొత్తం కేసుల సంఖ్య 1,27,697కు చేరుకుంది. కాగా తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 9 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకూ కరోనా మృతుల సంఖ్య 878కి చేరుకుంది.

ప్రస్తుతం తెలంగాణలో 31,699 యాక్టివ్ కేసులున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 2,325 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 95,162కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 74.5% ఉండగా.. మరణాల రేటు 0.65శాతంగా ఉంది. ఒక మిలియన్ జనాభాకు 38,351 చొప్పున పరీక్షలు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇంకా 878 మందికి చెందిన రిపోర్టులు రావల్సి ఉంది.

కాగా ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 24,598 మంది ఉన్నారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలోనే అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 347 కేసులు నమోదు కాగా.. భద్రాద్రి- 117, కరీంనగర్ 106, ఖమ్మం 161, మేడ్చెల్ 121, నల్గొండ- 191, నిజామాబాద్ 114, రంగారెడ్డి- 212, సిద్దిపేట 109, సూర్యాపేట 107, వరంగల్ అర్బన్ 112 కేసులు నమోదు అయ్యాయి. కాగా నమోదైన మొత్తం కేసుల్లో 69 శాతం కేసులు లక్షణాలు లేనివేనని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.