గోవా బ్యూటీ ఇలియానా కొత్త ప్రియుడు..!
Send us your feedback to audioarticles@vaarta.com
గోవా బ్యూటీ ఇలియానా ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. హయ్యస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్గా క్రేజ్ ఉన్న సమయంలోనే టాలీవుడ్‌ను వీడి బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ప్రారంభంలో బాలీవుడ్లో బర్ఫీతో సక్సెస్ కొట్టినప్పటికీ ఆశించిన స్థాయిలో మాత్రం అవకాశాలు ఇలియానాను వరించలేదు. అదే సమయంలో టాలీవుడ్ నుండి వచ్చిన అవకాశాలను ఇలియానా పట్టించుకోలేదు. మరోపక్క ప్రేమలో పడటం, లివిన్ రిలేషన్ వంటి పనులతో కెరీర్‌ను పట్టించుకోలేదు. లవ్ బ్రేకప్ తర్వాత ఇలియానాకు మబ్బులు తొలగిపోయాయి. అయితే అప్పటికే బాలీవుడ్ కూడా ఇలియానాను పక్కన పెట్టేసింది. ఎలాగైతేనేం ఇలియానా మళ్లీ ఫిజిక్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది. మళ్లీ బాలీవుడ్లో ‘అన్ ఫెయిర్ అండ్ లవ్లీ, ది బిగ్ బుల్’ చిత్రాల్లో నటిస్తుంది.
సోషల్ మీడియాలోనూ బిజీగానే ఉంటుంది. రీసెంట్గా ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ అంటూ నెటిజన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఇందులో ఓ నెటిజన్.. ఇప్పుడు మీ కొత్త ప్రియుడు ఎవరు? అని అడిగాడు. దానికి ఇలియానా ఏమాత్రం తడుముకోకుండా తన కుక్కను చూపిస్తూ.. వీడే నా బాయ్‌ఫ్రెండ్. తన పేరు చార్లి అని చెప్పింది. అండ్రూతో బ్రేకప్ ఇలియానాను మానసికంగా చాలా దెబ్బ తీసింది. అందుకనే ఇప్పట్లో ప్రేమ, దోమ అంటూ ఏ పని చేసేలా లేదని నెటిజన్స్ అనుకుంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments