'మ‌హాన‌టి' సిగ‌లో కొత్త పుర‌స్కారం

  • IndiaGlitz, [Saturday,May 04 2019]

గ‌తేడాది విడుద‌లైన 'మ‌హాన‌టి' సినిమా ఇప్పుడు కొత్త గౌర‌వాన్ని అందుకుంది. మ‌హాన‌టి సావిత్రి జీవితం ఆధారంగా వైజ‌యంతీ మూవీస్ , స్వ‌ప్న సినిమాస్ నిర్మించిన చిత్ర‌మిది. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. ఈ చిత్రానికి షాంగై అంత‌ర్జాతీయ చ‌ల‌న‌చిత్రోత్స‌వం (22వ ఉత్స‌వం)లో గొప్ప గౌర‌వం ల‌భించింది. ఈసినిమాను అక్క‌డ ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. పైగా అంత‌ర్జాతీయ ప‌నోర‌మ విభాగంలో ఎంపికైన ఏకైక భార‌తీయ చిత్రంగా ఈ చిత్రాన్ని ప్ర‌క‌టించారు.

కీర్తిసురేష్ ఈ చిత్రంలో సావిత్రిగా న‌టించారు. ఈ సినిమాతో కీర్తి సురేష్ ఓవ‌ర్‌నైట్ స్టార్ అయ్యారు. స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, దుల్క‌ర్ స‌పోర్టింగ్ రోల్స్ చేశారు. నాగ‌చైత‌న్య ఇందులో త‌న తాత పాత్ర‌ను పోషించారు. మిక్కీ.జె.మేయ‌ర్ సంగీతాన్ని స‌మ‌కూర్చారు. తమిళంలో ఈ సినిమా న‌డిగ‌య‌ర్ తిల‌గం పేరుతో విడుద‌లైంది. సావిత్రి జీవితంలో ఎత్తుప‌ల్లాల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.

More News

ప‌వ‌న్ ఆ పని చేస్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ కి ఈ ఎన్నిక‌ల్లో ఎన్ని సీట్లు వ‌స్తాయి?  ఆయ‌న టీడీపీతో పొత్తు పెట్టుకుంటారా? పెట్టుకోరా...

ఫైర్ యాక్సిడెంట్ జ‌రిగింది పాత సెట్లోనా?

`ఫైర్ యాక్సిడెంట్ జ‌రిగింది మా సెట్లో కాదు. మా హీరో గ‌తంలో షూటింగ్‌ చేసిన సెట్లో.

మెగాస్టార్ ఓటు దేనికి?

మెగా కుటుంబంలో హీరోలు ఎవ‌రైనా స‌రే, టైటిల్‌, టీజ‌ర్ వంటివ‌న్నిటినీ మెగాస్టార్‌, ప‌వ‌ర్‌స్టార్‌కు చూపించ‌కుండా దాదాపు విడుద‌ల చేయ‌రు.

పూజా.. అంత అడిగిందా?

పూజా హెగ్డే ఈ మ‌ధ్య `మ‌హ‌ర్షి` స్టేజ్ మీద దేవిశ్రీ ప్ర‌సాద్ ను ఉద్దేశించి `నేను చేసే తెలుగు సినిమాల‌కు, నువ్వే సంగీతం అందిస్తావు దేవీ.

త్రిష‌...ఇది వెలుగుల ద‌శ‌

కొన్ని సార్లు జీవితంలో ఏదో సాధించేయాల‌ని ఉంటుంది. కానీ ఎలా సాధించాలి? మ‌నం ఎంపిక చేసుకున్న రంగంలో మ‌న‌కు తెలిసిన వాళ్లున్నారా?