Manchu Lakshmi : సుమంత్ కౌగిలిలో మంచు లక్ష్మీ అలా.. ఏకీపారేస్తున్న నెటిజన్లు
Send us your feedback to audioarticles@vaarta.com
మంచు లక్ష్మీ.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారాలపట్టి అయిన ఈమె చైల్డ్ ఆర్టిస్ట్‌గా కొన్ని సినిమాల్లో నటించిన లక్ష్మీ. అమెరికాలో చదువుకున్నారు. తర్వాత ఇండియాకు వచ్చి టాలీవుడ్లో కొన్ని సినిమాల్లో నటించారు. టెలివిజన్ హోస్ట్‌గానూ వ్యవహరించారు. కానీ వీటితో ఆమెకు చెప్పుకోదగ్గ పేరు రాలేదు. అయినప్పటికీ ప్రయత్నాలు మాత్రం మానడం లేదు. అయితే ఆమె మాటలు, ప్రవర్తన , వేషధారణ విపరీతంగా ట్రోలింగ్‌కు గురవుతోంది. కానీ మంచు లక్ష్మీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తాజాగా మరోసారి మంచు లక్ష్మీ నెటిజన్లకు దొరికిపోయారు.
అసలేం జరిగిందంటే:
ఫిబ్రవరి 9న అక్కినేని హీరో సుమంత్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ ఫోటో షేర్ చేశారు. హ్యాపీ బర్త్ డే డార్లింగ్.. నీకు అంతా మంచి జరగాలి అంటూ ఓ ఫోటో షేర్ చేశారు. అదే ఇప్పుడు కొంచెం ఇబ్బందికరంగా వుంది. అందులో మంచు లక్ష్మీని సుమంత్ రోమాంటిక్‌గా కౌగిలించుకుని వున్నారు. పెళ్లయి, ఓ బిడ్డకు తల్లయిన మహిళ అయ్యుండి పరాయి మగాడితో అలాంటి ఫోటో దిగుతారా.. దిగినా ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదేనా మోహన్ బాబు నేర్పిన డిసిప్లిన్ అంటూ ఘాటుగా కామెంట్స్ పెడుతున్నారు.
నువ్వున్నది అమెరికాలో కాదు ఇండియాలో :
సుమంత్ నీకు ఫ్రెండ్ కావొచ్చు లేదా కజిన్ కావొచ్చు .. కానీ పబ్లిక్ లైఫ్‌లో వున్ వ్యక్తులు జాగ్రత్తగా వుండాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. అమెరికాలో వుండొచ్చినా, పుట్టి పెరిగిన భారతదేశ మూలాలను మరిచిపోకూడదు కదా అని సలహా ఇస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మంచు లక్ష్మీ నక్షత్రం అనే సినిమాలో నటిస్తున్నారు. లక్ష్మీ ప్రసన్నా పిక్చర్స్ బ్యానర్లోనే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
Enduk amma maak iyanni? 🙏 Aah expression enti asalu? #blocked
— manoj sharma (@ManojSharma99b) February 9, 2023
ఒక పెళ్లయిన అమ్మాయి ఎలా ఉండకూడదు నిన్ను చూస్తే అర్థమవుతుంది మీలాంటి వాళ్ళ వల్లే మన భారతీయ సంస్కృతి పాడైపోయేది
— KiranNandan (@kiran79002761) February 9, 2023
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com