కరోనాపై అతి వీడియో ఏంటి చార్మీ.. సబబేనా!?
- IndiaGlitz, [Monday,March 02 2020]
కరోనా వైరస్ లేదా కోవిడ్-19 పేరు వింటేనే ప్రపంచం వణికిపోతోంది.. చైనాలోని వూహాన్‌లో వచ్చిన ఈ వైరస్ ఖండాలను దాటేసి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. తెలంగాణలో సైతం వచ్చేసింది. మరోవైపు ఢిల్లీలో కూడా ఈ వైరస్ ఒకరిద్దరికి సోకినట్లు వైద్యులు నిర్దారణకు వచ్చారు. ఇలాంటి వార్తలు విన్న జనాలు గజ గజ వణికిపోతున్నారు. ఈ క్రమంలో భారత ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది.
మైండ్ దొబ్బిందా..?
అయితే పరిస్థితి ఇలా ఉంటే నటి, నిర్మాత చార్మీ మాత్రం ఈ వైరస్ తెలంగాణ, ఢిల్లీకి రావడంపై అతి చేస్తూ టిక్‌టాక్‌లో ఓ వీడియో చేసింది. హేయ్ గాయ్స్ కరోనా వచ్చేసిందటగా.. ఆల్ ది బెస్ట్, వెలకమ్ అంటూ స్వాగతం పలికింది చార్మీ.. అంటే వైరస్ రావడం చార్మీకి ఆనందన్న మాట. అదేమైనా మంచి కార్యక్రమమా..? ఏదైనా శుభకార్యమా..? కరోనా వైరస్‌ను స్వాగతం పలకడమేంటి..? చార్మీ కొంపదీసి మైండ్ దొబ్బిందా..? లేకుంటే కరోనా అంటే కరీనా అనుకుంటున్నావా..? అంటూ నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆటాడేసుకుంటున్నారు. అయితే ఇలా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో దెబ్బకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆ టిక్ టాక్ వీడియో డెలీట్ చేసేసింది. డెలీట్ చేస్తే ఏం ఫలితం.. జరగాల్సిన నష్టం.. తిట్టాల్సిన తిట్లు నెటిజన్లు గట్టిగా తిట్టిపోశారుగా.!.
ఏంటిది చార్మీ!
ఒక సెలబ్రిటీ అయ్యుండి కరోనా వచ్చిందట.. తగు జాగ్రత్తలు తీసుకొండి అని చెప్పి ఉంటే తన హుందాతనం చాటుకున్నట్లు ఉండేది.. కానీ ఇలా అతి చేస్తూ అది కూడా ఆల్ ది బెస్ట్ చెబుతూ వీడియో చేయడం ఎంతవరకు సబబు..? అసలు ఆ కరోనా అంటే ఏంటి..? కరోనా వస్తే పరిస్థితి ఏంటి..? అనేది చార్మీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న మాట. మాట పెదవి దాటితే వెనక్కి తీసుకోలేం చార్మీ.. అందుకే మాట్లాడే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి మరీ మాట్లాడాలి.. సెలబ్రిటీ అయినంత మాత్రానా ఇలా ఇష్టానుసారం మాట్లాడేస్తే అన్నీ చెల్లుతాయంటే జరగదు కదా..? అని క్రిటిక్స్ తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు.