'ఆర్ఆర్ఆర్' పోస్టర్ కాపీ కొట్టారంటూ ట్రోలింగ్...!
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా రూపొందుతోన్న మోస్ట్ అవెయిటెడ్ ప్యాన్ ఇండియా మూవీ `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. ఎప్పుడెప్పుడా అని ఎంటైర్ ఇండియన్ మూవీ ఇండస్ట్రీ ఎదురుచూస్తున్న ట్రిపులార్ సినిమాను తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ ఏడాది దసరా సందర్భంగా అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలకు సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. గుర్రంపై రామ్‌చరణ్, బుల్లెట్‌పై ఎన్టీఆర్ ఉన్న ఈ పోస్టర్‌పై ఇప్పుడు ట్రోలింగ్ మొదలైంది. జక్కన్న ఈ పోస్టర్‌ను హాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టాడంటూ ట్రోలింగ్ మొదలు పెట్టారు.
హాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఘోస్ట్ రైడర్ సినిమాలో ఓ యాక్షన్ సీక్వెన్స్‌లో ఉండే సన్నివేశాన్ని రాజమౌళి కాపీ కొట్టి పోస్టర్ రెడీ చేశాడంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇలా ట్రోలింగ్ బారిన పడటం రాజమౌళికి ఏమీ కొత్త కాదు.. బాహుబలి సినిమాకు కూడా ఆయన విమర్శలను ఎదుర్కొన్నవాడే. అయితే తన మార్క్‌ను క్రియేట్ చేసి తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు దర్శకధీరుడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ విషయంలోనూ అదే జరుగుతుందని రాజమౌళి, తెలుగు సినీ అభిమానులు అంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout