పూరి ఆకాష్‌ని ఓ రేంజ్లో ఆడుకుంటున్న నెటిజన్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు పూరి ఆకాష్‌ని నెటిజన్లు ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. ఆకాష్ ఇప్పటి వరకూ ఏం సినిమాలు చేశాడో కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. ఆకాష్‌ని హీరోగా నిలబెట్టాలన్న జగన్నాథ్ తాపత్రయం ఒక్క సినిమాతో కూడా నెరవేరలేదు. తీసిన సినిమాలన్నీ డిజాస్టర్లే. అయితే తన పుట్టిన రోజు నేపథ్యంలో పూరి ఆకాష్ నేడు ఒక ట్వీట్ పెట్టాడు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ ఈ సారి తాను పుట్టిన రోజు వేడుకలను నిర్వహించుకోవడం లేదని ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. అలాగే తన అభిమానులు కూడా అలాంటివేమీ చేయకుండా సేఫ్‌గా ఇంట్లోనే ఉండాలని కాంక్షించాడు. ఈ ట్వీట్‌ని చూసిన నెటిజన్లు ఆకాష్‌ను తెగ ట్రోల్ చేస్తున్నారు.
‘రియల్లీ ప్లాన్ చేశాం అన్నా.. ఈ ఇయర్ నీ బర్త్ డే స్పెషల్ కరోనా చేసింది. ఇంతకీ నీ బర్త్ డే ఎప్పుడు అన్నా?’ అని ఒకరు.. ఇన్ని చెప్పాడు కానీ బర్త్‌డే మాత్రం ఎప్పుడో చెప్పలేదు’ అని ఒకరు.. ‘మా బర్త్‌డే దిక్కు లేదు అంటే నీది ఒకటి’ అని ఒకరు.. ‘అయ్యెయ్యో 1000 కిలో మీటర్ల కేక్ ఆర్డర్ ఇచ్చాం.. 50/50 ఫ్లెక్సీస్ 20 డిజైన్ చేయించాం. బైక్ ర్యాలీ.. బ్లడ్ డొనేషన్ క్యాంప్ ప్లాన్ చేశాం.. అంతా గలాట్ చేస్తున్నావ్ కదన్నా..’ అని మరొకరు.. ‘నేను నీకు చాలా పెద్ద ఫ్యాన్ అన్నా.. ఇంతకీ నీ బర్త్ డే ఎప్పుడన్నా?’ అని ఇంకొకరు.. ఫన్నీ ఫన్నీ పిక్స్‌తో రకరకాలుగా ట్వీట్స్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com