Actress Anjali: అంజలి ఆస్తులపై ట్రోలింగ్.. అసలు మ్యాటర్ తెలిస్తే షాకే..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు తెరపై తెలుగమ్మాయిలు బొత్తిగా కనిపించని రోజుల్లో ఎంట్రీ ఇచ్చింది రాజోలు పిల్ల అంజలి. తన అందం, అభినయంతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. 2006లో తెరంగేట్రం చేసిన అంజలి.. ఆ తర్వాత తెలుగునాట అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్‌కు వెళ్లింది. అసలే బొద్దుగా వున్నవాళ్లని తమిళనాడు వాసులు బాగా ఇష్టపడతారు. దీంతో అనతికాలంలోనే కోలీవుడ్‌లో జెండా పాతింది అంజలి. తమిళ్‌లో వరుస అవకాశాలతో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. ఆ తర్వాత తెలుగులో వెంకటేశ్, బాలకృష్ణ లాంటి అగ్ర కథానాయకుల సరసన నటించింది. కానీ ఎందుకో ఆ స్టార్ డమ్‌ని నిలబెట్టుకోలేకపోయింది అంజలి. ఇటీవల పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సరసన వకీల్ సాబ్ సినిమాలో నటించినప్పటికీ ఆమెకు చెప్పుకోదగ్గ ఆఫర్లు రాలేదు. తాజాగా నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో ఐటెం సాంగ్ చేసి ప్రేక్షకులను మెప్పించింది.
15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్.. స్టార్‌డమ్ నిలబెట్టుకోలేక:
ఇదిలావుంటే అంజలిపై తాజాగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో అంజలి బాగానే ఆస్తులు సంపాదించారని అంటూ వుంటారు. కానీ అది ఏమాత్రం నిజం కాదని.. చెన్నై, హైదరాబాద్ నగరాల్లో ఆమె సంపాదించిన ఆస్తుల విలువ రూ.10 కోట్లేనంటూ వార్తలు వచ్చాయి. దీనిపైనే నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో సినిమాకు దాదాపు రూ.50 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకునే అంజలి ఇంతకాలం సినీ ఇండస్ట్రీలో వున్నప్పటికీ ఏమాత్రం ఆస్తులు వెనకేసుకోకపోవడంతో వారు అయ్యో అంటున్నారు.
సొంత కుటుంబ సభ్యులతోనే ఆస్తుల గొడవ:
అయితే అంజలి ఆస్తుల విషయంగా తన సొంత కుటుంబ సభ్యులతో గొడవ పడిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఆ మధ్య మూడు నాలుగు రోజుల పాటు ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయి షాకిచ్చింది. ఏది ఏమైనా హీరోయిన్‌గా పెద్దగా సక్సెస్ కాకపోగా.. ఆస్తులు కూడా సంపాదించింది లేకపోవడంతో అంజలి పట్ల నెటిజన్లు జాలి చూపిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com