"హాట్ యాంకర్‌కి అంతకన్నా చిన్నవి దొరకలేదా?"
Send us your feedback to audioarticles@vaarta.com
ఆ హాట్ యాంకర్‌కి అంతకన్నా చిన్నవి దొరకలేదా? ఆమె ట్రై చేయలేదా? లేకుంటే చేసినా లేవన్నారా? అయినా కన్న బిడ్డల ముందు ఆ చిందులేంటి? ఆ బట్టలేంటి? అంటూ ఎవరికి తోచిన రీతిలో వాళ్లు ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. మరికొందరైతే సిల్వర్ స్క్రీన్ ఇమేజ్ కోసం ఇంకెన్నాళ్లు మేడం ఈ చిట్టిపొట్టి దుస్తులు అంటూ అడిగీ అడగనట్టే అడిగేశారు. అయినా ఆ యాంకర్ అలాంటివాటిని చూసి, వాటిని పట్టించుకునే స్టేజ్‌లో అసలు లేదు. అబ్బో.. ఇలాంటి కామెంట్లు అనసూయ చాలానే చూసింది. వింటూ కూర్చుంటే ఏది తప్పు, ఏది రైటో ప్రపంచం చెబుతూనే ఉంటుంది. అవన్నీ పట్టించుకుంటే మనం పని చేసుకోలేం. అందుకే మనసుకు నచ్చింది చేసుకుంటూ ముందుకెళ్లాలన్నది ఆమెను వకాల్తా పుచ్చుకుని చెప్పేవారి మాట.
ఇంతకీ ఇంత రచ్చ ఎందుకు జరిగిందంటే న్యూ ఇయర్ సందర్భంగా ఆరావళి హిల్స్ లో అనసూయ తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేశారు. అందులో భాగంగానే తన ఇద్దరు కొడుకులతో ముక్కాలా ముక్కాబులా పాటలకు స్టెప్పులు కూడా వేశారు. అక్కడిదాకా అంతా బాగానే ఉంది కానీ, ఆ పాటలో అనసూయ స్టెప్పులు వేస్తున్నప్పుడు మరీ కురచ బట్టలు ధరించారన్నమాట. కన్న కొడుకులు ఎదిగి వస్తుంటే, వారి ముందు అంత చిట్టిపొట్టి బట్టలు ఏంటని ట్రోల్స్ మొదలయ్యాయి. ఎప్పటిలాగే వారి పని వారిది... ఇలాంటి బుల్ షిట్‌ను పట్టించుకునే తీరిక లేదంటూ తన బిజీ షెడ్యూల్లో మునిగితేలే అనసూయ వైఖరి ఆమెది. అంతే కదా..! కాయిన్ హాజ్ టూ సైడ్స్ అంటే ఇదేనన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout