ప్రియాంక చోప్రాను ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్స్‌

  • IndiaGlitz, [Tuesday,May 07 2019]

న‌టి ప్రియాంక చోప్రాను నెటిజ‌న్స్ ట్రోల్ చేస్తున్నారు. అందుకు కార‌ణం మీట్ గాలా 2019. అమెరికా సోమ‌వారం ఈ వేడుక సోమ‌వారం అమెరికాలో ప్రారంభ‌మైంది.

ఇందులో త‌న ఇండియా నుండి ప్రియాంక చోప్రా, దీపికా ప‌దుకొనె పాల్గొన్నారు. క్యాంప్‌.. 'నోట్స్ ఆన్ ఫ్యాష‌న్' అనే థీమ్‌తో ఈ వేడుక‌ను నిర్వ‌హించారు. అంటే విభిన్న‌మైన దుస్తుల్లో సంద‌డి చేయాలి. థీమ్ ప్ర‌కారం ప్రియాంక చోప్రా, దీపికా ప‌దుకొనె డిఫ‌రెంట్ వ‌స్త్ర‌ధార‌ణ‌లో క‌నిపించారు. దీపిక బార్బీ బొమ్మ‌లా త‌యారైంది.

ప్రియాంక డ్రెస్సింగ్ బాగానే ఉన్నా.. హెయిర్ స్టైల్ మాత్రం కామెడీగా త‌యారైంది. చూడ‌టానికి పిచ్చుక గూడులా ఉంది. ఆమె భ‌ర్త నిక్ జోన‌స్ ప‌క్క‌న లేకుంటే ఆమెను గుర్తు ప‌ట్టేవారు కారేమో అనేంతలా ప్రియాం మారిపోయింది. వెంట‌నే నెటిజ‌న్స్ ప్రియాంక హెయిర్ స్టైల్‌పై ట్రోల్ చేయ‌డం మొద‌లెట్టేశారు.