ఆర్జీవికి డెత్ డే విషెస్ అంటూ ఓ ఆటాడుకుంటున్న నెటిజన్లు
Send us your feedback to audioarticles@vaarta.com
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. ఆయన సినిమాల కాదు.. ఆయన కూడా తన ట్వీట్ల ద్వారా ప్రత్యేకంగా నిలుస్తుంటారు. ఒక రాజకీయ నాయకుడని చూడరు... పెద్ద సెలబ్రిటీ అనీ చూడరు.. ఏదైనా విషయంలో దొరికారా.. ఇక అంతే సంగతులు. సోషల్ మీడియా వేదికగా చెడుగుడు ఆడేస్తారు. దీనికి నిదర్శనమే ఇటీవల నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్. భగత్ ఒక పులితో సరదాగా వాకింగ్ వెళ్తున్న వీడియోను ఆర్జీవీ ట్వీట్ చేసి ఒక ఆట ఆడేసుకున్న విషయం తెలిసిందే.
ఇక సక్సెస్‌తో సంబంధం లేకుండా ఆయన తీసే సినిమాలు అన్నీ ఇన్నీ కావు. థియేటర్లు లేకుండా ఓటీటీ ద్వారా జనాలపైకి వదిలేస్తుంటారు. నేడు ఆర్జీవీ పుట్టినరోజు. సాధారణంగా ఏ సెలబ్రిటీ అయినా ఏం చేస్తారు? తెల్లవారింది మొదలు.. తెగ హడావుడి ఉంటుంది. కేక్ కటింగ్స్.. గిఫ్ట్స్ వగైరా వగైరాతో సందడి చేస్తారు. కానీ ఆర్జీవీ మాత్రం ఇందుకు భిన్నం. తన పుట్టినరోజు కాదని నిజానికి ఇది తన డెత్ డే అంటూ సోషల్ మీడియా వేదికగా కన్నీళ్లు పెట్టుకున్నారు. అదేనండి ఎమోజీస్‌తో తన బాధను వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆయన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
‘ఇది నా పుట్టినరోజు కాదు. ఇది నా మరణించిన రోజు. ఎందుకంటే నా జీవితంలో మరో ఏడాది చనిపోయింది’ అంటూ ట్వీట్ చేశారు. ఇక నెటిజన్లు ఏమైనా తక్కువ తిన్నారా? మరింత రెచ్చిపోయి మరీ ఆర్జీవీకి డెత్ డే విషెస్ చెబుతున్నారు. ఆర్జీవీ ముక్కులో దూది పెట్టి.. నుదుటున బొట్టు పెట్టి మరీ డెత్ డే విషెస్ చెబుతూ చెలరేగి పోతున్నారు. రకరకాల జిఫ్‌లతో సందడి చేస్తున్నారు. ఎక్కువగా బండ్ల గణేష్, బ్రహ్మానందాన్ని వాడేసి ఆర్జీవీని ఓ ఆట ఆడుకుంటున్నారు.
No , it’s not my birthday but it’s my deathday today because one more year in my life died today ??????
— Ram Gopal Varma (@RGVzoomin) April 7, 2021
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com