'తిక్క' బ్యూటీ ట్వీట్.. వదిన వస్తోంది అన్నా అంటూ తేజుపై కామెంట్స్

  • IndiaGlitz, [Saturday,July 10 2021]

2016లో సాయిధరమ్ తేజ్ నటించిన 'తిక్క' చిత్రం గుర్తుందిగా. బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచిన చిత్రం అది. ఆ చిత్రంలో హీరోయిన్ గా బ్రెజిలియన్ మోడల్ లారిస్సా బొనెసి నటించింది. ఈ సినిమాని ఎవరూ పట్టించుకోలేదు కానీ.. తేజు, లారిస్సా జంటపై మాత్రం అప్పట్లో మీడియాలో, అభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

సాయి తేజ్, లారిస్సా మధ్య అప్పట్లో సంథింగ్ వ్యవహారం ఏదో సాగింది అంటూ చాలా రూమర్స్ వచ్చాయి. తమ గురించి ఎన్ని రూమర్స్ వచ్చిన తేజు, లారిస్సా మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఫ్రెండ్ షిప్ కొనసాగిస్తున్నారు. తాజాగా లారిస్సా ఓ ట్వీట్ చేసింది. దీనికి తేజు రిప్లయ్ ఇచ్చి తనపైనే సెటైర్లు పడేలా బుక్కయ్యాడు.

తిక్క తర్వాత ఒకటి రెండు టాలీవుడ్ చిత్రాల్లో తప్ప లారిస్సా కనిపించలేదు. ఒకరకంగా చెప్పాలంటే ఆమె టాలీవుడ్ కు పూర్తిగా దూరమైంది. చాలా కాలం తర్వాత హైదరాబాద్ కు రాబోతున్నానని, అందుకోసం ప్లాన్ చేసుకుంటున్నానని లారిస్సా రీసెంట్ గా ట్వీట్ చేసింది.

దీనికి తేజు ఫన్నీ జిఫ్ ఇమేజ్ తో వావ్ అంటూ రిప్లై ఇచ్చాడు. ఆల్రెడీ వీరిద్దరిపై రూమర్స్ ఉండడంతో తేజుని నెటిజన్లు చిలిపి కామెంట్స్ తో ఆడేసుకుంటున్నాడు. 'వదిన అరైవింగ్ సూన్ అన్నా', 'వచ్చాక కాల్ చెయ్ రిసీవ్ చేసుకుంటా' లాంటి కామెంట్స్ తో నెటిజన్లు మోతెక్కిస్తున్నారు.

ఇక జవాన్ దర్శకుడు బీవీఎస్ రవి ఐతే.. 'ఇలాంటివే తగ్గించుకుంటే మంచిది' తేజుకి ప్రకాష్ రాజ్ జిఫ్ ఇమేజ్ తో స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఇదిలా ఉండగా సాయితేజ్ ప్రస్తుతం దేవకట్టా దర్శకత్వంలో 'రిపబ్లిక్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. మంచి అంచనాలున్న ఈ చిత్రం త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది.