రెండో పెళ్లా.. సినిమానా.. ఈ ట్విస్టేంటి మనోజ్!?
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్.. కొద్ది రోజుల క్రితమే భార్య ప్రణీత రెడ్డి నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ఆయన మళ్లీ రెండో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చినప్పటికీ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. అయితే తాజాగా.. ఆయన ట్విట్టర్లో సరదాగా అభిమానులతో సంభాషిస్తూ ‘ త్వరలో ఫైర్బాల్లా మీ ముందుకు రాబోతున్నాను. వారం రోజుల్లో మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పుబోతున్నాను’ అని ట్వీట్ చేశాడు.
అయితే ఇందుకు స్పందించిన ఓ వీరాభిమాని రెండో పెళ్లి గురించేనా..? నిజంగానే చేసుకుంటున్నారా..? అని అడిగాడు. దీనికి మనోజ్ చాలా లాజిక్‌గా బదులిచ్చాడు. ‘వామ్మో..’ అంటూ రిప్లై ఇచ్చాడు. అయితే ఆ ట్వీట్ వెనుక ఆంతర్యమేంటి..? అసలు మంచబ్బాయ్ ఏం చేయబోతున్నాడు..? అనేదానిపై అభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే.. అబ్బే పెళ్లేం కాదండోయ్.. సినిమా చేస్తున్నాడ్లే.. అందుకే ఇలా ట్వీట్ చేసి ఉండొచ్చని మరికొందరు వీరాభిమానులు చెబుతున్నారు.
‘ఒక్కడుమిగిలాడు’ మూవీ తర్వాత మనోజ్ సినిమాలు ఇంతవరకూ చేయలేదు.. కొన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన సినిమాలకు దూరమయ్యాడు. మరి తాజా ట్వీట్ సారాంశం రెండో పెళ్లా.. లేకుంటే సినిమానా..? అనే ట్విస్ట్‌కు తెరపడాలంటే వారం రోజులు వెయిట్ చేయాల్సిందే..!
Now that I am all set to glow like a fire ball?? I would like to announce something interesting in a week's time. Stay tuned ???? pic.twitter.com/zKHJy1xIAp
— MM*????❤️ (@HeroManoj1) January 28, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments