Bichagadu:అప్పుడు రూ.500, రూ.1000 ... ఇప్పుడు రూ.2 వేలు, ‘‘బిచ్చగాడు’’ వచ్చినప్పుడల్లా నోట్ల రద్దే ..!!
Send us your feedback to audioarticles@vaarta.com
దేశంలో రూ.2000 నోట్ల చెలామణిని ఉపసంహరించుకుంటున్నట్లుగా భారత రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రజలు తమ వద్ద వున్న 2000 నోటును మే 23 నుంచి సెప్టెంబర్ 30 మధ్యకాలంలో బ్యాంక్లో డిపాజిట్ చేసుకోవచ్చని, మార్పిడి చేసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. ఇదిలావుండగా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. నోట్ల రద్దుకు ‘‘బిచ్చగాడు’’ సినిమాకు లింక్. అదేంటి.. నోట్ల రద్దు చేయమని ఆ సినిమాలో ఏం లేదు కదా. అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ విషయం సినిమా కథ గురించి కాదు.. సినిమా రిలీజైన టైం గురించి. బిచ్చగాడు విడుదలైన సంవత్సరాల్లోనే భారత ప్రభుత్వం నోట్లను రద్దు చేసింది.
2016లో బిచ్చగాడు రిలీజ్.. రూ.500, రూ.1000 నోట్ల రద్దు :
విజయ్ ఆంటోనీ హీరోగా వచ్చిన బిచ్చగాడు తమిళంలో 2016 మార్చి 4న విడుదల కాగా.. తెలుగులో అదే ఏడాది మే 13న రిలీజైంది. ఈ సినిమా వచ్చిన ఐదు నెలలకు 2016 నవంబర్ 8న దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. దేశ ప్రజలకు అదో షాకింగ్ న్యూస్. నల్లధనాన్ని అరికట్టేందుకు ఈ చర్య తీసుకున్నామని ప్రధాని చెప్పిన మాటలను ప్రజలు అంగీకరించారు.
శుక్రవారం బిచ్చగాడు 2 రిలీజ్.. రూ.2 వేల నోట్లు వెనక్కి :
దేశ భవిష్యత్తు కోసం ఆయన తీసుకున్న నిర్ణయం కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారు. డబ్బును మార్చుకోవడానికి బ్యాంకుల ముందు పడిగాపులు కాశారు. పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోగా.. ఎన్నో శుభకార్యాలు నిలిచిపోయాయి. జనం పంటిబిగువున తమ బాధను భరిస్తూ మోడీకి అండగా నిలిచారు. తత్ఫలితంగా డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చి పారదర్శకత ఏర్పడింది. ఇక తాజాగా శుక్రవారం బిచ్చగాడు 2 రిలీజైంది. ఈ సినిమా వచ్చిన గంటల వ్యవధిలోనే రూ.2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్లుగా ఆర్బీఐ ప్రకటించింది. యాదృచ్చికమే అయినా.. సరిగ్గా బిచ్చగాడు సినిమా టైంలోనే ఇలా ఎందుకు జరుగుతోంది అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వస్తున్నాయి. కొంతమంది బిచ్చగాడు 3 రాకుండా చూసుకోండయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments