సుశాంత్ ఫ్యాన్ మెయిడ్ పోస్టర్‌కు నెటిజన్లు ఫిదా
Send us your feedback to audioarticles@vaarta.com
నటుడు సుశాంత్ రాజ్‌పుత్ మరణాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. కొందరు అభిమానులు ఆయన గురించే ఆలోచిస్తూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికీ ఆయనను తలుస్తూ అభిమానులు పోస్టులు పెడుతూనే ఉన్నారు. దీనిలో భాగంగా అభిమానులు తయారు చేసిన ఓ పోస్టర్‌ను చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. అంతేకాదు.. ఈ పోస్టర్ ఫిలింఫేర్‌ను సైతం ఆకర్షించింది. ఫిలింఫేర్ తన అఫీషియల్ ట్విటర్ అకౌంట్లో ఆ పోస్టర్‌ను పోస్ట్ చేసింది.
సుశాంత్‌కు తన కుక్క ఫడ్జ్‌తో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ అభిమానులు ఆ పోస్టర్‌ను రూపొందించారు. అఖిల్ చేతి వేలిని అప్యాయంగా ఫడ్జ్ తడుముతున్నట్టుగా ఆ పోస్టర్‌ను సుశాంత్ అభిమానులు తయారు చేశారు. దీనిని ట్విటర్లో పోస్ట్ చేసిన ఫిలింఫేర్.. ‘బంధానికి ఎప్పుడూ మరణం ఉండదు. సుశాంత్ ఆయన పెంపుడు కుక్కకు మధ్య ఉన్న బంధాన్ని తెలియజేస్తూ ఓ అభిమాని రూపొందించిన అద్భుతమైన పోస్టర్ ఇది’ అని పేర్కొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com