మోదీ ఏం చెప్పబోతున్నారు.. దేశ ప్రజల్లో సర్వత్రా ఆసక్తి!
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో.. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ రాత్రి 08 గంటలకు జాతినుద్ధేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం అధికారిక ట్విట్టర్‌లో పేర్కొంది. అయితే.. ఇవాళ మోదీ ఏం చెప్పబోతున్నారు..? లాక్‌డౌన్ పొడిగిస్తారా..? పొడిగించి మరిన్ని సడలింపులు ఉంటాయా..? లేకుంటే ఉన్న సడలింపులను మొత్తం తీసేస్తారా..? ఇంతకీ పొడిగింపు ఉందా..? లేదా..? ఒకవేళ ఉంటే ఎప్పటి వరకూ ఉంటుంది..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దేశ ప్రజలంతా మోదీ ప్రసంగం వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. అయితే.. మోదీ ఇలా జాతిని ఉద్ధేశించి మాట్లాడటం ఇది ఐదోసారి. ప్రసంగంతో పాటు రాష్ట్రాలకు, వివిధ రంగాలకు ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది.
పొడిగింపు పక్కా.. ఎప్పటి వరకు!?
కరోనా మహమ్మారి దేశంలో విలయతాండవం చేస్తుండటంతో ఇప్పటికే మూడు సార్లు లాక్ డౌన్ విధించడం జరిగింది. అయితే 4.0 ఉంటుందా..? ఉండదా..? అనేది ఇవాళ రాత్రి 08 గంటలకు ప్రధాని ప్రసంగంతో తేలిపోనుంది. కాగా.. సోమవారం నాడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దాదాపు అందరి ముఖ్యమంత్రుల నుంచి పొడిగింపు అనే మాటే వచ్చింది. కాన్ఫరెన్స్ అనంతరం కేంద్రంలోని ఉన్నతాధికారులు, పలువురు మంత్రులతో మాట్లాడిన ప్రధాని ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలియవచ్చింది. ఈ నిర్ణయాన్ని ఇవాళ 08 గంటలకు మీడియా ముఖంగా ప్రధాని దేశ ప్రజలకు వెల్లడించనున్నారు. మొత్తానికి చూస్తే పొడిగింపు ఉంటుందని స్పష్టంగా అర్థమవుతోంది కానీ ఎప్పటి వరకూ అనేదానిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. కాగా ఈ నెల 17తో లాక్ డౌన్ 3.0 ముగియనుంది. అంటే ఇంకా ఐదురోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ తరుణంలో ఈ నెల చివరి వరకు పొడిస్తారా..? లేకుంటే జూన్ సెకండ్ వీక్ వరకు పొడిగిస్తారా..? అనేది తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout